MI vs KKR : సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా ?…కోల్ కతాతో ముంబై ఢీ

MI vs KKR : ఐపీఎల్ 2026 సీజన్ లో ఆదివారం రసవత్తర పోరు జరగబోతోంది. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కోల్ కత్తా నైట్ రైడర్స్ తలపడబోతున్నాయి

MI vs KKR

ఐపీఎల్ 2026 సీజన్ లో ఆదివారం రసవత్తర పోరు జరగబోతోంది. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కోల్ కత్తా నైట్ రైడర్స్(MI vs KKR) తలపడబోతున్నాయి. గత ఐదేళ్లుగా టైటిల్ కోసం నిరీక్షిస్తున్న ముంబై ఇండియన్స్ ఈ సీజన్ ను ఘనంగా ఆరంభించాలని ఎదురుచూస్తోంది.

హోం గ్రౌండ్ లో ముంబై(MI vs KKR) ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి మ్యాచ్ విన్నర్లతో పటిష్టంగా కనిపిస్తోంది. గతేడాది ప్లే ఆఫ్స్ చేరినా.. ఫైనల్ చేరలేకపోయింది. అయితే ఈ సీజన్ లో మాత్రం విజేతగా నిలవాలనే పట్టుదలతో ముంబై ఉంది.

ఏ సీజన్ లోనూ తొలి మ్యాచ్ గెలవని సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలని ఆ జట్టు భావిస్తోంది. అయితే స్టార్ ఆల్ రౌండర్లు విల్ జాక్స్, మిథెల్ సాంట్నర్ తొలి మ్యాచ్ కు అందుబాటులో లేరు. వీరిద్దరూ ఇంకా ముంబై జట్టుతో కలవలేదు. టీ20 ప్రపంచకప్ లో అదరగొట్టిన విల్ జాక్స్ పై ముంబై చాలా ఆశలు పెట్టుకుంది. కాగా సాంట్నర్ స్థానంలో అఫ్గాన్ మిస్టరీ స్పిన్నర్ అల్లా గజన్ఫర్ ఆడనుండగా.. విల్ జాక్స్ స్థానంలో మయాంక్ మార్కండేను ఆడించే ఛాన్సుంది.

టీమ్ కాంబినేషన్ ను చూస్తే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ ఓపెనర్లుగా బరిలోకి దిగడం ఖాయం. దీంతో రికెల్టన్ బెంచ్ కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్ మిడిలార్డర్ లో ఆడనుండగా.. హార్దిక్ పాండ్యా ఫినిషర్ పాత్ర పోషించనున్నాడు.

మయాంక్ మార్కండే, అల్లా గజన్ఫర్ స్పిన్నర్లుగా ఆడనుండగా.. బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహర్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్లుగా అశ్వని కుమార్, అథర్వ అంకోలేకర్ ఒకర్ని ఆడించే అవకాశముంది. మరోవైపు కోల్ కతా నైట్ రైడర్స్ ది దీనికి భిన్నమైన పరిస్థితి. ఆ జట్టు గాయాలతో సతమతమవుతోంది.

MI vs KKR

హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్ దూరమవడం, పతిరణ కొన్ని మ్యాచ్ లకు అందుబాటులో లేకపోవడం కేకేఆర్ కు గట్టి ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. ముస్తఫిజుర్ స్థానంలో ముజర్ బానీని తీసుకున్న కోల్ కతా బౌలింగ్ బలహీనంగా కనిపిస్తోంది. కామెరూన్ గ్రీన్, వైభవ్ అరోరాపైనే పేస్ బౌలింగ్ భారం పడుతుంది. అటు స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తితో పాటు సునీల్ సరైన్ కీలకం కానున్నాడు. ఇక బ్యాటింగ్ కేకేఆర్ టాపార్డర్ బలంగా కనిపిస్తోంది.

ఫిన్ అలెన్ టిమ్ సిఫర్డ్ రాకతో మరింత స్ట్రాంగ్ అయింది వీరికి తోడుగా రహానే, రవిన్ రవీంద్ర, రమణీప్సింగ్, రింకూ సింగ్ కూడా కోల్ కతాకు బలమని చెప్పొచ్చు. ఇక వాంఖడే పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో భారీస్కోర్లు నమోదవడం ఖాయమని అంచనా.

RCB: ఆర్సీబీ ధనాధన్ ..సన్ రైజర్స్ చిత్తు

Exit mobile version