Mumbai Indians : ముంబైకి డూ ఆర్ డై..సన్ రైజర్స్ తో కీలక మ్యాచ్

Mumbai Indians : ఐపీఎల్  2026లో ముంబై ఇండియన్స్ అగ్ని పరీక్షకు సిద్ధమయింది.వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడబోతోంది

Mumbai Indians

ఐపీఎల్  2026లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) అగ్ని పరీక్షకు సిద్ధమయింది.వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడబోతోంది.ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ముంబై కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది. ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే మిగిలిన 7 మ్యాచ్‌ల్లో 6 మ్యాచులలో గెలిచి తీరాలి. దీంతో ఇవాళ్టి మ్యాచ్ తో ముంబై ప్లే ఆఫ్ అవకాశాలను దాదాపుగా డిసైడ్ చేస్తుంది.
చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 103 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలవడం ముంబై ఇండియన్స్(Mumbai Indians), రన్ రేట్ ను కూడా దెబ్బ తీసింది.

గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో ఆడడంపై స్పష్టత లేదు. ఒకవేళ రోహిత్ ఆడితే మాత్రం ముంబైకి అడ్వాంటేజ్. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లోకి రావడం ముంబైకి చాలా కీలకం.ఈ సీజన్ లో సూర్య ఒక్క మ్యాచ్ లోనూ చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. తన మునుపటి సత్తా నిరూపించుకునేందుకు ఈ మ్యాచ్ అతనికి మంచి అవకాశం. ఇదిలా ఉంటే ఒక సెంచరీ బాదిన తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్‌లో కీలకం కానున్నాడు.

అలాగే హార్దిక్ పాండ్యా, పావెల్ వంటి హిట్టర్స్ కూడా రాణించాల్సిన అవసరం ఉంది. ఇక బౌలింగ్ లోనూ ముంబై అనుకున్న స్థాయిలో రాణించడం లేదు.ఈ సీజన్‌లో జస్ప్రీత్ బుమ్రా కేవలం 2 వికెట్లు మాత్రమే తీయడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. అశ్వని కుమార్, శార్దూల్ ఠాకూర్ నుంచి బుమ్రాకు సపోర్ట్ అందాల్సి ఉంది. మిచెల్ శాంట్నర్ స్థానంలో విల్ జాక్స్ లేదా కేశవ్ మహారాజ్ ఎవరో ఒకరు తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇంపాక్ట్ ప్లేయర్లుగా అల్లా గజన్ఫర్, మయాంక్ రావత్, రాజ్ అంగద్ బావా, డానిష్ మలేవర్, ర్యాన్ రికెల్టన్‌లను అందుబాటులో ఉంచుకుంది. పరిస్థితిని బట్టి స్పిన్ సెన్సేషన్ గజన్ఫర్‌ను బరిలోకి దించే అవకాశం ఉంది.వాంఖడే స్టేడియంలో ముంబై(Mumbai Indians) రికార్డు బాగున్నప్పటికీ, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను తక్కువ అంచనా వేయలేం..

Mumbai Indians

సన్ రైజర్స్ హైదరాబాద్ సూపర్ ఫామ్ లో ఉంది. ఇప్పటి వరకూ 8 మ్యాచ్ లు ఆడి 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో కొనసాగుతోంది. గత మ్యాచ్ లో రాజస్థాన్ రాయ‌ల్స్ పై బంప‌ర్ విక్ట‌రీ సాధించింది. భారీ టార్గెట్ ను అలవోకగా  అందుకుంది. బ్యాటింగ్ లో స్టార్ ప్లేయర్స్ అంతా ఫామ్ లోకి వచ్చేశారు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్ కీలకం కానున్నారు. అయితే హెడ్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. హెడ్ కూడా చెలరేగితే ఇక సన్ రైజర్స్ కు తిరుగు లేనట్టే.

బౌలింగ్ లో కమిన్స్ కూడా రావడంతో సన్ రైజర్స్ బలపడింది. ముఖ్యంగా మలింగ అదరగొడుతున్నాడు. అతనితో పాటు హుస్సేన్ , ప్రఫుల్ కూడా పేస్ ఎటాక్ లో సత్తా చాటుతున్నారు. శివాంగ్ శర్మ, స్పిన్ భారాన్ని మోస్తున్నారు. వాంఖడే స్టేడియంలో బ్యాటింగ్ పిచ్ పై సన్ రైజర్స్ బౌలర్లు ఎలా రాణిస్తారో చూడాలి.

Social media : ఆన్‌లైన్ ముసుగులో రాక్షసత్వం..ఇంటర్నెట్ వేదికగా వెలుగు చూస్తున్న వికృత ప్రవృత్తి

Exit mobile version