SL Cricket : ఫిట్ గా ఉంటేనే ఎన్ వోసీ..లంక క్రికెట్ బోర్డు నిర్ణయం

SL Cricket : శ్రీలంక క్రికెటర్లు ఇంకా భారత్ కు రాలేదు. పతిరణ, హసరంగా , తుషారా వంటి ప్లేయర్స్ విషయంలో శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

SL Cricket

ఐపీఎల్ 19వ సీజన్ కు ఇంకా వారం రోజులే టైముంది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లతో ప్రిపరేషన్ క్యాంపులు నిర్వహిస్తూ బిజీగా ఉన్నాయి. అయితే శ్రీలంక క్రికెటర్లు(SL Cricket) ఇంకా భారత్ కు రాలేదు. పతిరణ, హసరంగా , తుషారా వంటి ప్లేయర్స్ విషయంలో శ్రీలంక క్రికెట్(SL Cricket) బోర్డు నిర్ణయం తీసుకుంది. వర్క్ లోడ్ మేనేజ్ మెంట్, గాయాల దృష్ట్యా వీరందరికీ ముందు ఫిట్ నెస్ టెస్టులు నిర్వహించి ఆ తర్వాతే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్ణయించింది.

దీని ప్రకారం వచ్చే వారం ఐపీఎల్ కాంట్రాక్టులు ఉన్న తమ ఆటగాళ్లందరికీ లంక బోర్డు ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించి పరిశీలించనుంది. అయితే మతీష పతిరణ మాత్రం ఇప్పటికే ఫిట్ నెస్ సాధించినట్టు సమాచారం. దీనిపై కోల్ కత్తా నైట్ రైడర్స్ కు లంక క్రికెట్ వర్గాలు సమాచారమిచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఎన్ వోసీ జారీ కాగానే అతను జట్టుతో కలుస్తాడని కోల్ కత్తా మేనేజ్ మెంట్ చెబుతోంది. టీ20 ప్రపంచకప్ మధ్యలో పతిరణ గాయపడ్డాడు.

SL Cricket

ఈ స్టార్ పేసర్ లేకపోవడంతో లంక బౌలింగ్ బలహీనంగా మారిపోయింది. ఇప్పుడు గాయం నుంచి కోలుకుని ఐపీఎల్ ఆడేందుకు పతిరణ సిద్ధమయ్యాడు. మలింగా స్టైల్ లో బౌలింగ్ చేసే పతిరణ 2022లో ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచీ చెన్నై సూపర్ కింగ్స్ కే ప్రాతినిథ్యం వహించిన ఈ లంక యువ పేసర్ ధోనీ కెప్టెన్సీలో మరింత రాటుదేలాడు. గత ఏడాది జరిగిన మినీవేలంలో పతిరణను కేకేఆర్ రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది. యార్కర్ల స్పెషలిస్టుగా పేరున్న పతిరణ డెత్ ఓవర్లలో కోల్ కత్తాకు అత్యంత కీలకం కాబోతున్నాడు.

ఇదిలా ఉంటే హసరంగా , నువాన్ తుషారా, ఎహసాన్ మలింగా, చమీరా, నిస్సాంక, కమిందు మెండిస్ కూడా ఫిట్ నెస్ టెస్ట్ ఎదుర్కోనున్నారు. ఇప్పటికే దీనిపై లంక క్రికెట్ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. ఐపీఎల్ తర్వాత బిజీ షెడ్యూల్ ఉండడంతో తమ ఆటగాళ్ల విషయంలో రిస్క్ తీసుకోలేమని తెలిపాయి. కానీ ఫిట్ గా ఉన్న ప్రతీ ప్లేయర్ కూ నిరభ్యంతర పత్రం జారీ చేస్తామని స్పష్టం చేశాయి. మొత్తం మీద వచ్చే వారం లంక క్రికెటర్లు తమ తమ ఐపీఎల్ ఫ్రాంచైజీలతో చేరనున్నారు.

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ప్రశంసలు

Exit mobile version