Rajasthan Royals : రూ.15 వేల కోట్లతో డీల్…చేతులు మారిన రాజస్థాన్ రాయల్స్

Rajasthan Royals : ఐపీఎల్ ఫ్రాంచైజీల బ్రాండ్ వాల్యూ ఏ స్థాయిలో పెరిగిందో మరోసారి రుజువైంది. లీగ్ చరిత్రలోనే అతి పెద్ద ఫ్రాంచైజీ డీల్ నమోదైంది

Rajasthan Royals

ఐపీఎల్ ఫ్రాంచైజీల బ్రాండ్ వాల్యూ ఏ స్థాయిలో పెరిగిందో మరోసారి రుజువైంది. లీగ్ చరిత్రలోనే అతి పెద్ద ఫ్రాంచైజీ డీల్ నమోదైంది. 19వ సీజన్ ఆరంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) ఫ్రాంచైజీ అమ్మకం పూర్తయింది. ఏకంగా రూ.15,300 కోట్లకు అమెరికా వ్యాపారవేత్త కల్ సోమానీ నేతృత్వంలోని కన్సార్టియం రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని సొంతం చేసుకుంది.

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకూ ఇదే పెద్ద డీల్. గత కొన్ని రోజులుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ అమ్మకాల ప్రక్రియ జోరుగా సాగుతోంది. అయితే ఆర్సీబీ కంటే ముందే ఆర్ఆర్ టీమ్ డీల్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం రాజస్థాన్ ఫ్రాంచైజీలో ఎమర్జింగ్ మీడియా అధినేత మనోజ్ బదాలే 65 శాతాన్ని కలిగి ఉండగా.. మిగిలిన 35 శాతాన్ని రెడ్ బర్డ్ క్యాపిటల్, లాచ్ లూన్ మర్డోక్ సొంతం చేసుకున్నారు.

2008లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) ఫ్రాంచైజీని రూ.556 కోట్లకు కొనుగోలు చేశారు. అదే సీజన్ లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాయల్స్ ఛాంపియన్ గా నిలిచింది. తర్వాత రెండో టైటిల్ గెలవకున్నా టీమ్ బ్రాండ్ వాల్యూ మాత్రం భారీగా పెరుగుతూనే ఉంది. మిగిలిన ఫ్రాంచైజీలతో పోలిస్తే తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న రాయల్స్ అమ్మకం ప్రక్రియ గత ఏడాది చివరిలో మొదలైంది. ది రెయిన్ గ్రూపు దీనిని పర్యవేక్షించింది.

ఐపీఎల్ కు ఉన్న పాపులారిటీ దృష్ట్యా ఆదిత్య బిర్లా గ్రూపు , టైమ్స్ గ్రూపు వంటి పెద్ద సంస్థలు ఆసక్తి చూపించినా రేసులో వెనుకబడ్డాయి. గతంలోనే రాజస్థాన్ ఫ్రాంచైజీలో వాటా ఉన్న సోమానీ కన్సార్టియం గ్రూపులో ఉన్న మిగిలిన వ్యాపారవేత్తలను ఒప్పంచి డీల్ ముగించారు.

Rajasthan Royals

ప్రస్తుతానికి ఒప్పంద ప్రక్రియ ప్రాథమికంగా పూర్తయినట్టు తెలుస్తోంది. అయితే ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాతే ఫ్రాంచైజీని పూర్తిగా కన్సార్టియం గ్రూపుకు అప్పగించనున్నారు. ఇదిలా ఉంటే రాజస్థాన్ రాయల్స్ అమ్మకం పూర్తయినట్టు వార్తలు వచ్చిన కొద్ది గంటలకే కల్ సోమానీ గురించి అభిమానులు ఆరా తీస్తున్నారు.

అమెరికాకు చెందిన సోమానీ ఎడ్యుటెక్ , ఏఐ, స్పోర్ట్స్ టెక్నాలజీ వంటి రంగాల్లో కీలక పెట్టుబడులు పెట్టి పెద్ద వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. ఈ కన్సార్టియం గ్రూపులో సోమానీతో పాటు వాల్ మార్ట్ కుటుంబానికి చెందిన వ్యాపారవేత్త రాబ్ వాల్టన్ , అమెరికాలో మరో పెద్ద వ్యాపార కుటుంబం హంప్ కూడా భాగస్వాములుగా ఉన్నారు.కాగా రాజస్థాన్ రాయల్స్ రికార్డు ధరకు అమ్ముడై పెద్ద డీల్ గా నిలిచినా త్వరలో ఆర్సీబీ ఫ్రాంచైజీ దీనిని బ్రేక్ చేసే అవకాశముంది.

Dhurandhar 2 : కలెక్షన్లలో సరికొత్త రికార్డులు…ధురంధర్ 2 ఐదు రోజుల వసూళ్లు ఇవే

Exit mobile version