Shreyas Iyer
ఊహించినట్టే జరిగింది. భారత టీ ట్వంటీ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పై వేటు పడింది. అతని స్థానంలో అందరూ అనుకున్నట్టుగానే శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) కు పగ్గాలు అప్పగించారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లతో పాటు ఆసియా క్రీడల కోసం భారత జట్లను ప్రకటించారు. ఈ క్రమంలో శ్రేయాస్(Shreyas Iyer) ను సారథిగా నియమించారు.
గత కొంతకాలంగా సూర్యకుమార్ పేలవ ఫామ్ తో సతమతమవుతున్నాడు. సారథిగా సక్సెస్ అయినా వ్యక్తిగతంగా మాత్రం రాణించడం లేదు. ఒకప్పుడు మిస్టర్ 360గా అభిమానులతో పిలిపించుకున్న సూర్యకుమార్ క్రీజులో 10 నిమిషాలు కూడా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. దాదాపు ఏడాది నుంచి కనీసం హాఫ్ సెంచరీ కూడా సాధించలేదు.
అదే సమయంలో వయసు రీత్యా కూడా సెలక్టర్లు సూర్యకుమార్ ను తప్పించినట్టు తెలుస్తోంది. వచ్చే టీ ట్వంటీ ప్రపంచకప్ కు యువ క్రికెటర్లతో అత్యుత్తమ జట్టును తయారు చేసే ఉద్దేశంతో ఉన్న సెలక్టర్లు శ్రేయాస్ అయ్యర్ కు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చారు. గత కొన్ని ఐపీఎల్ సీజన్ల నుంచి శ్రేయాస్ అద్భుతంగా ఆడుతున్నాడు. అటు కెప్టెన్ గానూ అదరగొట్టాడు. కోల్ కతా నైట్ రైడర్స్ ను ఛాంపియన్ గా నిలిపాడు. పంజాబ్ ను గత సీజన్ లో రన్నరప్ గా నిలిపాడు. ఇదిలా ఉంటే శ్రేయాస్(Shreyas Iyer) కు డిప్యూటీగా తిలక్ వర్మ ఎంపికయ్యాడు.
ఇక చిచ్చర పిడుగు తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు. దీంతో 15 ఏళ్ల సూర్యవంశీ.. భారత సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ 16 ఏళ్ల వయస్సులో టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో వైభవ్ పరుగుల వరద పారించాడు.
ఆరెంజ్ క్యాప్ తో పలు అవార్డులను సొంతం చేసుకున్నాడు. అలాగే ఐపీఎల్ లో రాణించిన ప్రిన్స్ యాదవ్ కు చోటు దక్కింది. అటు చాలా రోజుల తర్వాత సిరాజ్ టీ20 జట్టులోకి తిరిగొచ్చాడు.ఈ రెండు సిరీస్ లకు బుమ్రాకు విశ్రాంతినివ్వడంతో సెలక్టర్లు సిరాజ్ ను ఎంపిక చేసారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో సిరాజ్ ఆకట్టుకున్నాడు. 17 మ్యాచ్ లలో 19 వికెట్లు పడగొట్టాడు.
అయితే ఆసియా క్రీడల జట్టులో బుమ్రాను తీసుకోవడంతో సిరాజ్ కు చోటు దక్కలేదు.సీనియర్ ఆటగాళ్లు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, సిరాజ్, అర్షదీప్ సింగ్ కూడా చోటు దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే ఐర్లాండ్ పర్యటనలో భారత్ రెండు టీ20లు ఆడనుంది. జూన్ 26, 28వ తేదీల్లో ఆ మ్యాచ్‌లు డబ్లిన్ వేదికగా జరగనున్నాయి. ఇక జూలై 1 నుంచి 11 వరకు ఇంగ్లండ్‌తో 5 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఇంగ్లాండ్ సిరీస్ కి భారత టీ20 జట్టు ః
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, వైభవ్ సూర్యవంశీ, రవి బిష్ణోయ్, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్
ఐర్లాండ్ తో సిరీస్ కు భారత టీ20 జట్టు ః
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, వైభవ్ సూర్యవంశీ, రవి బిష్ణోయ్, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్
ఆసియా క్రీడలకు భారత టీ20 జట్టు:
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, వైభవ్ సూర్యవంశీ, రవి బిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి
Presenting #TeamIndia's T20I squads for the tours of England & Ireland 2026 🇮🇳#ENGvIND | #IREvIND pic.twitter.com/f84kSSAIDf
— BCCI (@BCCI) June 6, 2026
Prakash Raj : నీ పని నువ్వు చూసుకో..జనసేన వర్సెస్ ప్రకాష్ రాజ్
