SRH
ఐపీఎల్ 2026 సీజన్ కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) కీలక నిర్ణయం తీసుకుంది. ఊహించినట్టుగానే రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సీజన్ లో కొన్ని మ్యాచ్ లకు దూరమయ్యాడు. ఫిట్ నెస్ సాధించిన తర్వాతే జట్టుతో కలవనున్నాడు. దీంతో సన్ రైజర్స్ యాజమాన్యం కొత్త కెప్టెన్ ను ఎంపిక చేసింది. అంతా అనుకున్నట్టుగానే విధ్వంసకర ఆటగాడు ఇషాన్ కిషన్ ను సారథిగా నియమించింది. కమ్మిన్స్ కోలుకుని జట్టుతో చేరే వరకూ ఇషానే నడిపిస్తాడని ఎస్ఆర్ హెచ్ ప్రకటించింది.
అలాగే ఇషాన్ కిషన్ కు డిప్యూటీగా అభిషేక్ శర్మ వ్యవహరించనున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సన్ రైజర్స్(SRH) ప్రకటన విడుదల చేసింది. ప్యాట్ కమ్మిన్స్ గత ఏడాది చివర్లో వెస్టిండీస్ తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. అప్పటి నుంచీ కాంపిటేటివ్ క్రికెట్ కు దూరమయ్యాడు. యాషెస్ లో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడిన కమ్మిన్స్ భారత్ తో సిరీస్ , టీ20 ప్రపంచకప్ నుంచి సైతం తప్పుకున్నాడు.
ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియా మెడికల్ టీమ్ పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. సీఏ మెడికల్ టీమ్ క్లియరెన్స్ ఇచ్చేంత వరకూ ఐపీఎల్ ఆడేందుకు వీలులేదు. కమ్మిన్స్ త్వరలోనే ఫిట్ నెస్ సాధిస్తాడని సన్ రైజర్స్ చెబుతున్నా మరో నెల రోజుల వరకూ సమయం పట్టేలా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ ఇషాన్ కిషన్ కు బాధ్యతలు అప్పగించింది కెప్టెన్ గా అభిషేక్ శర్మ పేరును కూడా పరిశీలించినా ప్రస్తుతం అతను పేలవ ఫామ్ లో ఉండడంతో వెనక్కి తగ్గింది. అనవసరంగా కెప్టెన్సీ ఒత్తిడితో ఇబ్బంది అభిషేక్ ను మరింత ఇబ్బంది పెట్టకూడదని భావించింది.
అతన్ని భవిష్యత్తు సారథిగా భావిస్తున్న సన్ రైజర్స్ ప్రస్తుతం ఇషాన్ కు డిప్యూటీగా ఎంపిక చేసింది. అలాగే ఇషాన్ కిషన్ కు కెప్టెన్ గా అనుభవం ఉండడం కూడా కలిసొచ్చింది. గత ఏడాది జార్థండ్ జట్టుకు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సారథిగా వ్యవహరించిన ఇషాన్ కిషన్ వ్యక్తిగతంగానూ అద్భుతంగా రాణించి ఆ జట్టును ఛాంపియన్ గా నిలిపాడు. దీంతో అభిషేక్ కంటే ఇషాన్ వైపే మొగ్గుచూపింది.
సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఇషాన్ కిషన్ ను రూ.11.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సీజన్ లో ఇషాన్ 14 మ్యాచ్ లు ఆడి 150కి పైగా స్ట్రైక్ రేట్ తో 354 రన్స్ చేశాడు. ఓవరాల్ గా ఐపీఎల్ లో 119 మ్యాచ్ లలో 2998 పరుగులు చేశాడు. ఇక కమ్మిన్స్ కెప్టెన్సీలో హైదరాబాద్ 30 మ్యాచ్ లు ఆడి 15 మ్యాచ్ లలో గెలిచింది. గత సీజన్ లో ఆరో స్థానంతో ముగించింది. ఇదిలా ఉంటే సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ను మార్చి 28న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్బీబీతో తలపడుతుంది.
𝐀𝐍𝐍𝐎𝐔𝐍𝐂𝐄𝐌𝐄𝐍𝐓 🚨
Pat Cummins will miss a few games while recovering from injury.
Until he recovers, Ishan Kishan will be the Captain and Abhishek Sharma will be the Vice-Captain. pic.twitter.com/etXJUkQJeG
— SunRisers Hyderabad (@SunRisers) March 18, 2026
