SRH
243 పరుగుల భారీ స్కోరు చేసి విజయంపై ధీమాతో ఉన్న ముంబై ఇండియన్స్ కు షాక్ తగిలింది.. సన్ రైజర్స్(SRH) బ్యాటర్లు రెచ్చిపోయారు. దొరికిన బాల్ ను దొరికినట్టుగా బాదేశారు. ముందు అభిషేక్ శర్మ, హెడ్…తర్వాత క్లాసెన్ , అరోరా విధ్వంసకర బ్యాటింగ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ టార్గెట్ ను ఊదేసింది.ఈ. మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కొత్త జోడీని ఓపెనర్లుగా పంపింది.
ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న విల్ జాక్స్‌తో పాటు ర్యాన్ రికల్టన్ రెచ్చిపోయారు.వీరిద్దరూ తొలి వికెట్‌కు 43 బంతుల్లో 93 పరుగులు జోడించారు. మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరుతున్నా.. రికల్టన్ మాత్రం ధాటిగా బ్యాటింగ్ చేశాడు.44 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ బాదాడు.
సూర్యకుమార్ యాదవ్ (5) మరోసారి సింగిల్ డిజిట్‌కే ఔట్ అయ్యాడు. చివరి వరకూ క్రీజులో ఉన్న రికల్టన్.. ముంబైకి భారీ స్కోరు అందించాడు. ముంబై ఈ మ్యాచ్‌లో 243/5 స్కోరు నమోదు చేసింది. రికల్టన్ 55 బంతుల్లో 123 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో ప్రఫుల్ హింగే 2 వికెట్లు తీయగా, ఈషన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, నితీశ్ కుమార్ రెడ్డి ఒక్కో వికెట్ తీశారు. కాగా ఇది.ఐపీఎల్ చరిత్రలోనే ముంబై ఇండియన్స్‌కు ఇది మూడో అత్యధిక స్కోర్. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మాత్రం ఇదే అత్యధిక స్కోర్.
చేజింగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు రెచ్చిపోయారు. భారీ టార్గెట్ ను కొన్ని బాల్స్ మిగిలి ఉండగానే ఫినిష్ చేయాలన్న లక్ష్యంతోనే బ్యాటింగ్ చేసినట్టు కనిపించింది. అభిషేక్ శర్మ,,హెడ్ పవర్ ప్లేలో దంచి కొట్టారు. తొలి వికెట్ కు 8.4 ఓవర్లలోనే 129 పరుగులు జోడించారు. అయితే ఐదు పరుగుల తేడాలో 3 వికెట్లు కోల్పోవడంతో సన్ రైజర్స్ వెనుకబడినట్టు కనిపించింది.
ఈ దశలో.క్లాసెన్ 65 హాఫ్ సెంచరీతో చెలరేగాడు.. చివరలో సలీల్ అరోరా మెరుపు బ్యాటింగ్ చేశాడు. మూడు సిక్సర్లు బాదాడు. 10 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. ఇక, ఈ సీజన్ లో హైదరాబాద్(SRH) కు ఇది వరుసగా 5వ విజయం.. దీంతో 244 రన్స్ టార్గెట్ ను హైదరాబాద్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేసింది. 6 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది.
HCA T20 League : హెచ్ సీ ఎ టీజీ20 లీగ్ ఆవిష్కరణ..అత్యుత్తమ ఆటగాళ్లు వెలుగులోకి వస్తారన్న రాయుడు
