Pakistan
పాకిస్థాన్ సూపర్ లీగ్ కు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఆఫ్ఘనిస్థాన్ తో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇప్పటికే పీఎస్ఎల్ ను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించాలని నిర్ణయించారు. అటు పలువురు విదేశీ ఆటగాళ్లు పాక్ వచ్చేందుకు కూడా ఇష్టపడడం లేదు. పీఎస్ఎల్ ఆడదామనుకుంటున్న కొద్దిమంది విదేశీ ప్లేయర్స్ కు సైతం బెదిరింపులు మొదలయ్యాయి.
పాకిస్థాన్(Pakistan) సూపర్ లీగ్ ఆడేందుకు రావొద్దంటూ హెచ్చరించాయి. తాజాగా పాకిస్థాన్ లో ఉన్న జమాత్ ఉల్ అహ్రార్ అనే తీవ్రవాద సంస్థ విదేశీ ప్లేయర్లకు బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చింది. ఆస్ట్రేలియా క్రికెటర్లు డేవిడ్ వార్నర్ , స్టీవ్ స్మిత్‌తో పాటు న్యూజిలాండ్ ప్లేయర్ డారిల్ మిచెల్‌ను టార్గెట్ చేస్తూ ఓ లేఖ విడుదల చేసింది.
పీఎస్ఎల్ టోర్నీలో ఆడేందుకు రావొద్దని ఒకవేళ తమ మాటలు పట్టించుకోకుండా పాల్గొంటే వారి ప్రాణాలకు తాము హామీ ఇవ్వలేమంటూ బెదిరింపులకు దిగింది. దీనికి సంబంధించి ఆయా ఆటగాళ్ల క్రికెట్ బోర్డులకు సైతం సూచనలు చేసింది. తాము క్రికెట్ బోర్డులకు స్పష్టంగా చెబుతున్నామని, ప్లేయర్స్ ను పంపొద్దని హెచ్చరించింది.
పాక్(Pakistan) ఉగ్రవాదల సంస్థలు క్రికెటర్లకు ఇలా ఓపెన్ వార్నింగ్ ఇవ్వడం ఇదే తొలిసారి. ప్రస్తుత పరిస్థితుల్లో పీఎస్ఎల్ నిర్వహించొద్దని అక్కడ ఉన్న ఉగ్రవాదసంస్థలు పలుమార్లు హెచ్చరించాయి. అయినా సరే పాక్ క్రికెట్ బోర్డు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కాకుంటే లీగ్ షెడ్యూల్లో పలు మార్పులు చేశారు.
పశ్చిమాసియాలో యుద్ధపరిస్థితుల కారణంగా ఇంధన లోటును దృష్టిలో ఉంచుకుని లీగ్ ను రెండు నగరాలకే పరిమితం చేశారు. అభిమానులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో పీఎస్ఎల్ నిర్వహిస్తామని పీసీబీ ఛైర్మన్ నక్వీ ప్రకటించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఉగ్రవాదులు విదేశీ ప్లేయర్స్ ను టార్గెట్ చేశారు. మ్యాచ్ లను అడ్డుకుంటామని.
అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటూ లేఖ విడుదల చేశాయి. ఇప్పటికే పలువురు విదేశీ ప్లేయర్స్ పీఎస్ఎల్ ఒప్పందాలను రద్దు చేసుకుని ఐపీఎల్ లో ఆడేందుకు నిర్ణయించుకున్నారు. జింబాబ్వే ప్లేయర్ ముజరబానీ, శ్రీలంక క్రికెటర్ దషున్ శనక ఐపీఎల్ ఫ్రాంచైజీలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు.
తమ లీగ్ ఒప్పందాలను రద్దు చేసుకోవడంపై పీసీబీ చీఫ్ నక్వీ కూడా విదేశీ ప్లేయర్స్ ను బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నాడు. గతంలో ఇలాంటి వారిపై ఏడాది పాటు నిషేధం విధించారు. అయినా సరే విదేశీ ప్లేయర్స్ భద్రతకే ప్రాధాన్యతనిస్తూ ఐపీఎల్ ఆడేందుకు మొగ్గుచూపుతున్నారు.
Anushka:బన్నీ-అట్లీ కాంబోలో బిగ్గెస్ట్ సర్ప్రైజ్.. ఎనిమిదేళ్ల తర్వాత వెండితెరపైకి అనుష్క
