Team India Finals : ఈరోజే పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక క్రాష్ ఫైట్.. టీమిండియాతో ఫైనల్‌లో ఢీకొట్టేది ఎవరు?

Team India Finals : మహిళల ఆసియా కప్ 2026 నాకౌట్ స్టేజ్‌లో టీమిండియా తన మాస్ డామినేషన్‌ను ప్రదర్శిస్తూ డైరెక్టుగా ఫైనల్లో అడుగుపెట్టేసింది.

Team India Finals

దుబాయ్ మైదానంలో మన భారత్ క్రికెటర్ల దెబ్బకి బంగ్లాదేశ్ విలవిలలాడిపోయింది. మహిళల ఆసియా కప్ 2026 నాకౌట్ స్టేజ్‌లో టీమిండియా తన మాస్ డామినేషన్‌ను ప్రదర్శిస్తూ డైరెక్టుగా ఫైనల్లో అడుగుపెట్టేసింది. మొదటి సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై ఏకంగా 40 రన్స్ తేడాతో విక్టరీ కొట్టి తిరుగులేని ఫామ్‌లో ఉన్నామని మరోసారి ప్రూవ్ చేసింది.

ఓపెనర్ షఫాలీ వర్మ తన పవర్‌ఫుల్ బ్యాటింగ్‌తో హాఫ్ సెంచరీ బాదగా, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అటు బ్యాట్‌తోనూ ఇటు బౌలింగ్‌తోనూ బంగ్లాను ఒంటరిగా దెబ్బతీసి టీమిండియాను ఫైనల్‌కు చేర్చడంలో హీరోగా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బంగ్లాదేశ్ టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. స్టార్టింగ్‌లోనే వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కేవలం 2 రన్స్ మాత్రమే చేసి ఔట్ అయినా కూడా మనవాళ్లు ఏ మాత్రం బెదిరిపోలేదు. యంగ్ సెన్సేషన్ షఫాలీ వర్మ బంగ్లాదేశ్ బౌలర్లపై రివర్స్ అటాక్ స్టార్ట్ చేసింది.

కేవలం 40 బాల్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 రన్స్‌ చేసి భారీ స్కోరుకు పునాది వేసేసింది. షఫాలీ వర్మకు జతగా ప్రతిక రావల్ 20 పరుగులు చేసి సపోర్ట్ ఇవ్వగా, ఆఖరులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. వికెట్ కీపర్ రిచా ఘోష్ 21 పరుగులు, దీప్తి శర్మ 13 రన్స్ వేగంగా జోడించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 149 పరుగుల మెరుగైన స్కోరును బోర్డుపై పెట్టింది.

ఇక 150 రన్స్ విక్టరీ టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగిన బంగ్లాను మన బౌలర్లు స్టార్టింగ్ నుంచే గజగజలాడించారు. నిలకడగా వికెట్లు పడగొడుతూ విపరీతమైన ప్రెజర్ పెంచడంతో బంగ్లాదేశ్ బ్యాటర్లలో ఎవరూ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు.

వారి టీమ్‌లో షోర్నా అక్తర్ చేసిన 22 పరుగులే హయ్యెస్ట్ స్కోరు కావడం టీమిండియా బౌలింగ్ దాటికి నిదర్శనంగా నిలిచింది. భారత స్పిన్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ 3 వికెట్లు తీసి బంగ్లా టీమ్ బ్యాటింగ్ వెన్నుముకను విరగ్గొట్టగా, నందని శర్మ 2 వికెట్లతో టీమిండియాకు సపోర్ట్ ఇచ్చింది. దీంతో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 109 రన్స్ మాత్రమే చేయగలిగి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

మరోవైపు ఈరోజు అంటే సెప్టెంబరు 11వ తేదీన జరగబోయే రెండో సెమీఫైనల్ పోరుపైన అందరి కళ్లూ పడ్డాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక, పాకిస్తాన్ టీమ్స్ ఫైనల్ బెర్త్ కోసం ఫైట్ చేయబోతున్నాయి. ఇంటర్నేషనల్ టీ20ల్లో రెండు జట్ల రికార్డులు చూస్తే పాకిస్తాన్‌కి కొంచెం ఆధిక్యం ఉంది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన 24 మ్యాచులలో పాక్ 12 గెలవగా, 11 మ్యాచులలో లంక విజయాన్ని సాధించింది. కాగా ఒక్క మ్యాచ్ మాత్రం ఫలితం తేలలేదు. అయినా కూడా 2026లో జరిగిన టీ20 సిరీస్‌లో శ్రీలంక 2-1 తేడాతో పాకిస్తాన్‌ను ఓడించి మంచి ఫామ్‌లో ఉండటం వారికి ప్లస్ పాయింట్ అవుతుంది.

Team India Finals

ఆసియా కప్ హిస్టరీని తిరగేస్తే ఈ రెండు జట్ల మధ్య ఇంకా పాత కసి రగులుతూనే ఉంది. 2024 ఆసియా కప్ సెమీస్‌లో పాక్ కొట్టిన 140/4 స్కోరును లంక 141/7తో చేజ్ చేసి 3 వికెట్లతో గెలిచింది. కానీ అదే సంవత్సరం టీ20 ప్రపంచకప్‌లో పాక్ 116 రన్స్ చేసినా..శ్రీలంకను 85 రన్లకే కట్టడి చేసి 31 రన్స్‌ తేడాతో ప్రతీకారం తీర్చుకుంది.

రికార్డుల్లో పాక్ కాస్త ముందున్నా కూడా, రీసెంట్ ఫామ్ పరంగా చూస్తే లంక లీడ్‌లో ఉంది. ఈ హెడ్ టు హెడ్ సమరంలో గెలిచే శ్రీలంకతో కానీ పాకిస్తాన్‌తో కానీ సండే జరిగే గ్రాండ్ ఫైనల్‌లో టీమిండియా(Team India Finals) అమీతుమీ తేల్చుకోబోతోంది. మరి ఈ సండే ట్రోఫీ ఎగరేసుకుపోయే ఆసియా క్వీన్స్ ఎవరో చూడాలంటే మాత్రం ఫైనల్ రచ్చ వరకూ వెయిట్ చేయాల్సిందే.

Friendship Breakup : ఫ్రెండ్షిప్ బ్రేకప్ కూడా లవ్ ఫెయిల్యూర్ వంటిదేనా? ..స్నేహం తెగిపోయినా హార్ట్ బ్రేక్ తప్పదా?

Exit mobile version