Vaibhav Sooryavanshi : బుడ్డోడు కాదు గేమ్ ఛేంజర్..ఇక రికార్డులు గల్లంతే

Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026 సీజన్ లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం ఓ రేంజ్ లో సాగింది. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్‌గా మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు

Vaibhav Sooryavanshi

వైభవ్ సూర్యవంశీని మేం ఎంపిక చేయలేదు.. తన బ్యాటింగ్ తో ఎంపిక చేసేలా మమ్మల్ని బలవంతం చేశాడు… ఇదీ బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వైభవ్ ఎంపికపై చెప్పిన మాట… ఈ ఒక్క మాట చాలు వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) ఏ స్థాయిలో సెలక్టర్లను ఆకట్టుకున్నాడో చెప్పేందుకు. నిజమే వైభవ్ ఇటీవల ఐపీఎల్ సీజన్ లో సృష్టించిన విధ్వంసాలు చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.

బుమ్రా నుంచి కమిన్స్, స్టార్క్ , రబాడ, షమీ వంటి హేమాహేమీ బౌలర్లను ఉతికారేశాడు. అసలు 140 కి.మీ వేగానికి పైగా వచ్చే బంతులను అంతే వేగంతో బౌండరీ అవతలకు పంపించాలంటే ఆ బ్యాటర్ వయసు కనీసం పాతికేళ్లయినా ఉండాలి. కానీ 15 ఏళ్ల సూర్యవంశీ తన బ్యాటింగ్ తో ఈ బౌలర్లందరికీ చుక్కలు చూపించాడు.

వాళ్ళ బౌలింగ్ ను ఎదుర్కొనే క్రమంలో కొంచెం కూడా బెదురు లేదు. బంతి పడిందా సిక్సర్ బాదడమే అన్న తరహాలో వైభవ్ విధ్వంసం సాగింది. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ లకు దిగ్గజ ఆటగాళ్లు సైతం ఫిదా అయిపోయారు. గత కొంతకాలంగా వైభవ్ ను జాతీయ జట్టులోకి తీసుకోవాలంటూ పలువురు మాజీ క్రికెటర్లు బీసీసీఐకి సూచిస్తూనే ఉన్నారు. తాజా ఐపీఎల్ ప్రదర్శనలతో సెలక్టర్లు కూడా వారందరి అభిప్రాయంతో ఏకీభవించక తప్పలేదు.

ఐపీఎల్ 2026 సీజన్ లో వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi )విధ్వంసం ఓ రేంజ్ లో సాగింది. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్‌గా మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 16 మ్యాచ్‌లలో 48.50 సగటు, ఏకంగా 237.30 స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. వీటితో పాటు సీజన్ మొత్తంలో ఏకంగా 72 సిక్సర్లు బాదాడు.

మూడుసార్లు 90 పరుగులు చేశాడు. ఈ అద్భుతమైన ఫామ్ చూసి సెలక్టర్లు అతడిని జట్టులోకి తీసుకోకుండా ఉండలేకపోయారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్ లతో పాటు ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన జట్టులోనూ వైభవ్ చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. అత్యంత పిన్నవయసులో టీమిండియాకు ఎంపికైన ప్లేయర్ గా సచిన్ రికార్డును బద్దలుకొట్టాడు. సచిన్ 16 ఏళ్ల 205 రోజుల వయసులో భారత్ జట్టుకు ఎంపికై అరంగేట్రం చేశాడు.

Vaibhav Sooryavanshi

ఇప్పుడు వైభవ్ 15 ఏళ్ల 71 రోజులకే జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐర్లాండ్ పై అతని అరంగేట్రం లాంఛనమే. అప్పుడు అత్యంత చిన్న వయసులో భారత్ కు ఆడిన ప్లేయర్ గా రికార్డులకెక్కుతాడు. ఐసీసీ ఫుల్ మెంబర్స్ టీమ్ తరపున అత్యంత తక్కువ వయసులో టీ20 అరంగేట్రం చేసిన ప్లేయర్ గా ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన ముజీబ్ ఉర్ రెహమాన్ రికార్డ్ సాధించాడు.

ఇప్పుడు ఆ రికార్డును వైభవ్ బ్రేక్ చేయబోతున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ లోనూ బుడ్డోడి బ్యాటింగ్ విధ్వంసంతో గత రికార్డులన్నీ గల్లంతవడం ఖాయమని పలువురు అంచనా వేస్తున్నారు.

Mamata Banerjee : మేనల్లుడికి మమత బిగ్ షాక్..దీదీ దిద్దుబాటు చర్యలు

Exit mobile version