Virat Kohli:ఆర్సీబీ గుండె చప్పుడు విరాట్ కోహ్లీ..ఐపీఎల్ అగ్రెషన్‌కు కేరాఫ్ అడ్రస్

Virat Kohli : ఐపీఎల్ చరిత్రలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే విరాట్ కోహ్లీ.. విరాట్ కోహ్లీ అంటేనే ఆర్సీబీ అన్నంతగా ఒక విడదీయరాని అనుబంధం ముడిపడిపోయింది

Virat Kohli

ప్రపంచ క్రికెట్‌లో కొన్ని పేర్లు కేవలం రికార్డుల కోసమే పుట్టాయా అన్నట్లుగా ఉంటాయి. మరి కొన్ని పేర్లు మాత్రం వింటేనే నరనరాల్లో తెలియని ఒక రకమైన పూనకం వచ్చేస్తుంది. అలాంటి ఒక అద్భుతమైన బ్రాండ్ పేరే విరాట్ కోహ్లీ. అందుకేనేమో తాజాగా ఐపీఎల్ 2026 సీజన్‌లో విరాట్ కోహ్లీ పేరు క్రికెట్ ప్రపంచాన్ని మరోసారి కూడా కుదిపేస్తోంది.

నిజానికి ఐపీఎల్ చరిత్రలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే కోహ్లీ.. విరాట్ కోహ్లీ అంటేనే ఆర్సీబీ అన్నంతగా ఒక విడదీయరాని అనుబంధం ముడిపడిపోయింది. 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు, రంగురంగుల జట్లు మారుతున్నా సరే.. హార్ట్‌ను పణంగా పెడుతూ వస్తున్న ఏకైక నమ్మకమైన కంచుకోట విరాట్ కోహ్లీ.

ఈ సుదీర్ఘ ప్రయాణంలో విరాట్ కోహ్లీ(Virat Kohli) కేవలం పరుగులు మాత్రమే చేయలేదు. బెంగళూరు నగరానికి ఒక కొత్త సంస్కృతిని, కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఒక బలమైన సామ్రాజ్యాన్ని నిర్మించాడు.

తాజాగా ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్ లో ..ఆర్సీబీని గెలిపించడానికి కోహ్లీ చూపించిన అంకితభావం, గెలుపు కోసం మైదానంలో ప్రదర్శించిన రౌద్రరూపం విరాట్ కోహ్లీలోని అసలైన ఫైటర్‌ను ప్రపంచానికి మళ్లీ పరిచయం చేశాయి.

ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ సాధించడంలో కోహ్లీ ఆడిన ఆ 42 బంతుల్లో 75 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్ ఒక క్లాసిక్ అనే చెప్పొచ్చు. ప్రెషర్ ఎంత ఎక్కువగా ఉంటే కోహ్లీ అంతగా రెచ్చిపోతాడని, పెద్ద మ్యాచ్‌లలో విరాట్ రేంజే వేరని ఈ ఇన్నింగ్స్ మళ్లీ ప్రూవ్ చేసింది. క్రీజులో కింగ్ కోహ్లీ ఉన్నంతసేపు ప్రత్యర్థి బౌలర్లకు గుండెల్లో వణుకు పుట్టాల్సిందే అన్నట్లుగా చేసింది.

కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నా..గ్రౌండ్‌లో కోహ్లీ యాటిట్యూడ్, చేసే ఫీల్డింగ్ సెటప్ చూస్తే ఇప్పటికీ ఆయనే రియల్ లీడర్ అని అర్థమవుతుంది. జట్టులో కెప్టెన్ అనే హోదా లేకపోయినా స్టేడియంలో ఉన్న లక్షలాది మంది కళ్లూ, కెమెరాలూ కేవలం కోహ్లీ స్టైల్, యాటిట్యూడ్‌ వైపే తిరుగుతాయంటేనే కోహ్లీ సంపాదించుకున్న క్రేజ్ అర్ధం అవుతుంది.

Virat Kohli

స్టేడియంలో విరాట్ కోహ్లీ చూపించే అగ్రెషన్‌ను కొందరు విమర్శించినా, ఫ్యాన్స్ దృష్టిలో మాత్రం అది ఆటపై కోహ్లీ అమితమైన ప్రేమే. కోహ్లీ ఎప్పుడూ కూడా గ్రౌండ్‌లో మౌనంగా ఉండటానికి అస్సలు ఇష్టపడడు. ప్రతి బంతిని ఒక యుద్ధంలా భావించి ఫైట్ చేయడం.. గుజరాత్ మ్యాచ్ లో అంపైర్ నిర్ణయంపై పట్టుబట్టడం, గిల్‌తో ముఖాముఖి చర్చకు దిగడం వంటి ఘట్టాలు కోహ్లీలోని తగ్గేదేలే అనే పోరాట స్వభావానికి అద్దం పడతాయి.

ఆర్సీబీకి ఇప్పటివరకు ఎన్ని ట్రోఫీలు వచ్చాయనేది అతని ఫ్యాన్స్‌కు ఇంపార్టెంట్ కాదు, విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆ జట్టులో ఉన్నాడనే ఒక్క నమ్మకమే వారిని స్టేడియానికి పరుగులు పెట్టేలా చేస్తుంది.

Virat Kohli

కోహ్లీ డిసిప్లిన్, ఫిట్‌నెస్, ఎలాంటి ప్రెషర్‌ను అయినా తట్టుకుని పోరాడే యాటిట్యూడ్ యూత్‌కు రోల్ మోడల్‌లా నిలిచేలా చేస్తాయి. ఏజ్ పెరుగుతున్నా ఆటపై ఉన్న కసి, ఒంట్లో ఉన్న ఫైర్ ఏమాత్రం తగ్గలేదని ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో కోహ్లీ బ్యాటింగ్ చూస్తేనే అర్థమవుతుంది.

ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని అడ్డంకులెదురైనా తలవంచకుండా నిలబడే కోహ్లీ.. ఆర్సీబీ జట్టుకు ఎప్పటికీ కూడా ఊపిరిగా, ఐపీఎల్ దూకుడికి అసలైన బ్రాండ్ అంబాసిడర్‌గా, ఫ్యాన్స్ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఒకే ఒక్కడుగా..కింగ్ కోహ్లీ పేరు నిలిచిపోతుంది.

Smartphone Hack :మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అయిందని డౌట్ ఉందా? ఈ 3 మార్పులు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి..

Exit mobile version