Women’s T20
మహిళల టీ20(Women’s T20) ప్రపంచకప్ ఫైనల్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఆదివారం లార్డ్స్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టైటిల్ పోరులో తలపడబోతున్నాయి. ఈ టోర్నీలో రెండు జట్లు ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్‌కు చేరుకున్నాయి.
దీంతో ఈ మ్యాచ్‌ను సమఉజ్జీల సమరంగా అభివర్ణిస్తున్నారు. బలాబలాల పరంగానూ రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టు కనిపిస్తున్నాయి. ఆసీస్‌కు ఓవరాల్ రికార్డుల్లో పైచేయి ఉంటే.. ఇంగ్లాండ్‌కు హోం అడ్వాంటేజ్ కనిపిస్తోంది. దీంతో హోరాహోరీ పోరు ఖాయమని అంచనా వేస్తున్నారు. ఈ ఫైనల్ పోరులో ఆస్ట్రేలియాను ఫేవరెట్‌గా చెబుతున్నారు.
ఎందుకంటే మెగాటోర్నీలో ఆ జట్టు రికార్డు మామూలుగా లేదు. ఏకంగా ఆరుసార్లు వరల్డ్ కప్ గెలిచిన కంగారూలు ఎనిమిదో సారి ఫైనల్ ఆడబోతున్నారు. ఎంతో ఒత్తిడి ఉండే ఐసీసీ ఫైనల్స్‌లో ఎలా ఆడాలో ఆసీస్‌కు బాగా తెలుసు. బ్యాటింగ్ లైనప్‌లో బెత్ మూనీ, అలిస్సా హీలీ, ఆష్లీ గార్డనర్, ఎల్లీస్ పెర్రీ మ్యాచ్ విన్నర్లుగా చెప్పొచ్చు. బౌలింగ్ విభాగంలోనూ ఆసీస్ బలంగా ఉంది. దీనికి తోడు అద్భుతమైన ఫీల్డింగ్ సైతం ఆసీస్ సొంతం.
మరోవైపు ఇంగ్లాండ్‌ను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. ఆ జట్టు కూడా అజేయంగానే ఫైనల్‌కు చేరింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇంగ్లాండ్ మంచి ఫామ్‌లో ఉంది. డాని వ్యాట్-హాడ్జ్, నాట్ సివర్-బ్రంట్, హీథర్ నైట్ వంటి స్టార్ బ్యాటర్లు రాణిస్తున్నారు.
సెమీ ఫైనల్లో కేవలం 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి నాట్ సైవర్-బ్రంట్ ఆడి జట్టును కాపాడిన విధానం అద్భుతమనే చెప్పాలి. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ కావడంతో, ఇంగ్లాండ్ జట్టుకు లార్డ్స్ మైదాన పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. ఇంగ్లాండ్ గెలిస్తే రెండోసారి వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంటుంది.
అటు ఆసీస్ జట్టు విజయం సాధిస్తే ఏడోసారి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడుతుంది. గత రికార్డుల్లో ఆసీస్‌దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 45 సార్లు తలపడితే ఆస్ట్రేలియా 22 సార్లు, ఇంగ్లాండ్ 20 సార్లు గెలిచాయి. ఇక మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న లార్డ్స్ పిచ్ బ్యాలెన్సింగ్‌గా రూపొందించారు. బ్యాటర్లతో పాటు బౌలింగ్‌కు సమానంగా అనుకూలించే అవకాశముంది.
Vaibhav : బుడ్డోడు వచ్చేశాడు.. చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
