Satellite Phone : బీఎస్‌ఎన్‌ఎల్ శాటిలైట్ ఫోన్ ..అడవులు, కొండల్లోనూ పనిచేసే సూపర్ డివైస్ స్పెషాలిటీలు ఇవే..

Satellite Phone : మనం కాల్ చేసినప్పుడు సిగ్నల్ డైరెక్టుగా ఉపగ్రహానికి వెళ్లి, అక్కడ నుంచి భూమిపై ఉన్న కంట్రోల్ స్టేషన్ ద్వారా అవతలి వ్యక్తికి కనెక్ట్ అవుతుంది.

Satellite Phone

నెట్‌వర్క్‌ సిగ్నల్స్ అస్సలు లేని అడవులు, ఎత్తైన కొండలు చివరకు సముద్రం మధ్యలో ఉన్నా సరే.. ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి పబ్లిక్ సెక్టార్ టెలికాం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త శాటిలైట్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ట్యాక్సులతో కలిపి దీని ధరను రూ.1,34,166 గా నిర్ణయించారు.

చూడటానికి పాతకాలపు కీప్యాడ్ ఫీచర్ ఫోన్‌లా కనిపిస్తున్నా.. దీని పనితీరు , అలాగే దీని వెనుకున్న టెక్నాలజీ మాత్రం చాలా పవర్ఫుల్. ఇది అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.

మనం వాడే స్మార్ట్‌ఫోన్లు మనకు దగ్గరలో ఉండే మొబైల్ టవర్ల సిగ్నల్స్ బేస్‌ మీదే పనిచేస్తాయి. ఆ టవర్లు లేకపోతే ఫోన్లలో ఏ మాత్రం సిగ్నల్స్ రావు. కానీ శాటిలైట్ ఫోన్(Satellite Phone) పని చేయడానికి భూమిపై ఉండే మొబైల్ టవర్లతో అస్సలు పని ఉండదు. ఇది గ్లోబల్ శాటిలైట్ నెట్‌వర్క్ ద్వారా డైరెక్టుగా అంతరిక్షంలోని శాటిలైట్స్‌తో కనెక్ట్ అవుతుంది.

మనం కాల్ చేసినప్పుడు సిగ్నల్ డైరెక్టుగా ఉపగ్రహానికి వెళ్లి, అక్కడ నుంచి భూమిపై ఉన్న కంట్రోల్ స్టేషన్ ద్వారా అవతలి వ్యక్తికి కనెక్ట్ అవుతుంది. అందుకే ప్రపంచంలో మొబైల్ సిగ్నల్స్ లేని ఏ మారుమూల ప్రాంతం నుంచి అయినా దీని ద్వారా ఈజీగా వాయిస్ కాల్స్ మాట్లాడొచ్చు, ఎస్సెమ్మెస్‌లు కూడా పంపుకోవచ్చు.

ఈ ఫోన్‌ను ఎలాంటి కఠినమైన వాతావరణ పరిస్థితులనైనా తట్టుకోవడానికి వీలుగా రగ్గ్‌డ్ డిజైన్‌తో తయారు చేశారు. ఛార్జింగ్ పెట్టుకునే ఫెసిలిటీ లేని ప్రాంతాల్లో ఎక్కువ రోజులు పనిచేయడానికి వీలుగా దీనిలో 3,180mAh భారీ బ్యాటరీని అందించారు. ఇది 8 గంటల టాక్‌టైమ్, 160 గంటల స్టాండ్‌బై టైమ్‌ను ఇస్తుంది.

అలాగే ప్రమాద సమయాల్లో ఉపయోగపడే ఎస్‌ఓఎస్ ఎమర్జెన్సీ బటన్ కూడా దీనిలో ఉంది. దీనిని నొక్కితే చాలు, యూజర్ ఉన్న నిఖరమైన జీపీఎస్ లొకేషన్ వివరాలు వెంటనే ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్లకు మెసేజ్ రూపంలో వెళ్తాయి. ఇది స్క్రీన్ స్క్రాచ్-రెసిస్టెంట్ ఫీచర్‌తో రావడమే కాకుండా, ఎండలో కూడా అక్షరాలు క్లియర్‌గా కనిపించేలా డిజైన్ చేశారు. జీపీఎస్ ట్రాకింగ్, ఎలక్ట్రానిక్ కంపాస్ వంటి సదుపాయాలు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి.

భద్రతా కారణాల వల్ల ఈ శాటిలైట్ ఫోన్‌ను(Satellite Phone) సాధారణ పౌరులు డైరెక్టుగా కొనడానికి వీలుండదు. దీనిని కొనాలన్నా, ఉపయోగించాలన్నా కూడా కేంద్ర టెలికాం శాఖ నుంచి ప్రత్యేక అనుమతి తప్పనిసరి. పర్మిషన్ లేకుండా దీనిని కలిగి ఉండటం చట్టరీత్యా నేరంగా భావిస్తారు.

దేశ సరిహద్దుల్లో పనిచేసే డిఫెన్స్ ఉద్యోగులు, సముద్రంలో ప్రయాణించే మారిటైమ్ అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలు, మైనింగ్ పరిశ్రమల్లో పనిచేసేవారు, మారుమూల అడవుల్లో పరిశోధనలు చేసే సైంటిస్టులు, సాహస యాత్రలు చేసే నిపుణులకు ఇది అవసరం అని టెలికాం శాఖ భావిస్తోంది.

అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాల్లోని దట్టమైన అడవులు, ఎడారి ప్రాంతాలు , సముద్ర ప్రయాణాల్లో శాటిలైట్ ఫోన్ల(Satellite Phone) వాడకం ఎప్పటి నుంచో ఉంది. అంతర్జాతీయంగా ఇరిడియం, గ్లోబల్‌స్టార్, ఇన్‌మార్శాట్ వంటి గ్లోబల్ కంపెనీలు ఈ సర్వీసులను అందిస్తున్నాయి.

Satellite Phone

ఐఫోన్ వంటి లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లలో కూడా ఎమర్జెన్సీ సమయాల్లో మెసేజ్‌లు పంపుకోవడానికి పరిమితమైన శాటిలైట్ కనెక్టివిటీని ఇస్తున్నారు. కానీ, పూర్తి స్థాయిలో కంటిన్యూగా వాయిస్ కాల్స్ మాట్లాడటానికి బీఎస్‌ఎన్‌ఎల్ తెచ్చిన స్పెషల్ శాటిలైట్ హ్యాండ్‌సెట్లే నమ్మకమైనవి.

ఈ ఫోన్ కావాలనుకునే సంస్థలు, వ్యక్తులు తమ పూర్తి వివరాలు, ఉపయోగించే ప్రాంతం, అవసరాన్ని తెలియజేస్తూ లోకల్‌గా ఉండే బీఎస్‌ఎన్‌ఎల్ కేంద్రాన్ని సంప్రదించొచ్చు. లేదా బీఎస్‌ఎన్‌ఎల్ అఫీషియల్‌గా అందించిన హెల్ప్‌లైన్ నంబర్ 94651 01323 లేదా 97688 66652 కు కాల్ చేసి బుకింగ్ వివరాలను తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన ప్లాన్లు, పూర్తి సమాచారం కోసం బీఎస్‌ఎన్‌ఎల్ అధికారిక వెబ్‌సైట్ లింక్‌ను ఇక్కడ చూడొచ్చు.. www.bsnl.co.in

SIR : ఏపీలో సర్ గడువు పొడిగింపు..తప్పులు లేని ఓటర్ల లిస్టే టార్గెట్

Exit mobile version