Humanoid Robot : మనుషులకే కాదు రోబోలకూ కోపం వస్తుందా..కస్టమర్‌ను ఎందుకు తన్నబోయింది?

Humanoid Robot : రోబోలకు కూడా ఈగో, ఆత్మాభిమానం ఉంటాయి.. వాటితో జాగ్రత్తగా ఉండాలని కొంతమంది ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

Humanoid Robot

హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీల్లో రోబోలు మనుషులపై తిరగబడటం చూసి అదంతా సినిమా కాబట్టే అని అవన్నీ ఫాంటసీలని అనుకున్నాం. కానీ తాజాగా రష్యాలోని ఒక ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో జరిగిన ఈ క్రేజీ అండ్ ఫన్నీ ఇన్సిడెంట్ చూస్తే మాత్రం.. నిజంగానే రోబోల యుగం వచ్చేసిందా? ఇక మనుషుల పని అంతేనా అనే డౌట్ రాక మానదు.

తనను గిల్లి చూద్దామని కావాలనే నెట్టిన ఒక కస్టమర్‌కి అక్కడే ఉన్న హ్యూమనాయిడ్ రోబో కోపంతో రివర్స్ అయి, ఏకంగా కాలు పైకెత్తి మరీ అతన్ని తన్నబోయిన మైండ్ బ్లాస్టింగ్ వీడియో ఒకటి.. ఇప్పుడు గ్లోబల్ వైడ్‌గా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మనుషులతో యంత్రాలు తలపడే రోజులు దగ్గర పడిపోయాయంటూ నెటిజన్లు ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తూ రకరకాల కామెంట్లతో నెట్టింట రచ్చ చేస్తున్నారు.

కాగా రష్యాలోని ఒక ఫేమస్ ఎలక్ట్రానిక్స్ షాప్‌లో డిస్‌ప్లేలో.. ఒక అడ్వాన్స్డ్ హ్యూమనాయిడ్ రోబోను ఉంచారు. ఆ షాప్‌లోకి వచ్చిన ఒక కస్టమర్, దాన్ని టెస్ట్ చేద్దామనో లేక సరదాకో గానీ ఆ రోబోను కావాలనే వెనక్కి తోశాడు.

అయితే, ఎవరూ ఏ మాత్రం ఊహించని విధంగా ఆ మెషీన్ తన బ్యాలెన్స్ నిలబెట్టుకుంటూనే, ఒక్కసారిగా కాలును పైకి లేపి ఆ వ్యక్తిని తన్నడానికి ట్రై చేసిన దృశ్యాలు ఆ వీడియోలో రికార్డ్ అయ్యాయి. దాంతో కస్టమర్ భయంతో వెనక్కి తగ్గిపోగా, ఆ రోబో ఇంకా అదే ఆవేశంగా ఉన్నట్లు కనిపించడంతో కంగారుపడిన షాప్ సిబ్బంది వెంటనే దాన్ని పవర్ ఆఫ్ చేశారు.

Humanoid Robot

ఈ వీడియో మొదట ఎక్స్‌ వేదికగా బయటకు రాగానే క్షణాల్లోనే మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. రోబోలకు కూడా ఈగో, ఆత్మాభిమానం ఉంటాయి.. వాటితో జాగ్రత్తగా ఉండాలని కొంతమంది ఫన్నీగా కామెంట్లు పెడితే.. ఇలాంటి సెల్ఫ్ కంట్రోల్ ఉండే రోబోలను కంట్రోల్ లేకుండా పబ్లిక్ మధ్యలో ఉంచితే ఫ్యూచర్‌లో పెద్ద ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉందంటూ మరికొంతమంది ఆందోళన వ్యక్తం చేశారు. చూడ్డానికి ఇది కామెడీగా కనిపిస్తున్నా టెక్నాలజీ విషయంలో డెంజర్ బెల్స్ మోగిందనడానికి ఇదొక ఎగ్జాంపుల్ అని ఇంకొంతమంద అభిప్రాయపడ్డారు.

అయితే, ఈ వైరల్ క్లిప్‌లో రోబో నిజంగానే దానిలోని ఏఐ ప్రోగ్రామింగ్ వల్ల సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం చేసిందా? లేదా బ్యాక్‌గ్రౌండ్‌లో రిమోట్ కంట్రోల్‌తో ఎవరైనా ఆపరేట్ చేస్తూ డ్రామా ఆడారా? అనే దానిపై ఇంకా ఎలాంటి అఫీషియల్ క్లారిటీ రాలేదు.

Bus Rape Case : బస్సుల్లో పరదాలు ఉండవు,పానిక్ బటన్స్ పని చేయాల్సిందే.. సర్కార్ సీరియస్ యాక్షన్

Exit mobile version