Phone:మీ ఫోన్ హ్యాక్ అయిందని డౌటా? ఈ సీక్రెట్ కోడ్స్‌తో వెంటనే చెక్ పెట్టండి..

Phone: ఒకవేళ మనకు తెలియని నంబర్ కనిపించిందంటే మాత్రం మీ ఫోన్ హ్యాకర్ల చేతిలో ఉన్నట్టే లెక్క.

Phone

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అందరికీ ఆరో ప్రాణంగా మారిపోయింది. బ్యాంక్ వివరాల నుంచి పర్సనల్ ఫోటోల వరకు అన్నీ వాటిలోనే ఉంచుకుంటున్నారు. అయితే కొన్నిసార్లు మన అనుమతి లేకుండానే మన ఫోన్లోని సమాచారం వేరే వాళ్లకు చేరుతోందని అప్పుడప్పుడూ అన్పిస్తూ ఉంటుంది.

మనకు వచ్చే కాల్స్ ఎవరైనా రహస్యంగా వింటున్నారేమో లేదా మెసేజ్‌లను ఎవరైనా చదువుతున్నారేమోనని అనుమానం కూడా వస్తుంటుంది. అయితే అటువంటప్పుడు ఈ మూడు సీక్రెట్ కోడ్స్ మనకు రక్షణ కవచంలా పనిచేస్తాయని టెక్ నిపుణులు అంటున్నారు.

ముందుగా మన ఫోన్(Phone) డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి.. స్టార్ హ్యాష్ 21 హ్యాష్ (*#21#) అని డయల్ చేయాలి. ఇది మీ కాల్స్ లేదా డేటా అన్ కండిషనల్ గా వేరే నంబర్‌కు కానీ ఫార్వర్డ్ అయితే మాత్రం వెంటనే చూపిస్తుంది. ఒకవేళ అక్కడ మనకు తెలియని నంబర్ కనిపించిందంటే మాత్రం మీ ఫోన్ హ్యాకర్ల చేతిలో ఉన్నట్టే లెక్క.

Phone

అలాగే ఒకవేళ మన ఫోన్(Phone) స్విచ్ఛాఫ్ ఉన్నప్పుడు కానీ సిగ్నల్ లేనప్పుడు కానీ మన కాల్స్ ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసుకోవాలంటే మాత్రం స్టార్ హ్యాష్ 62 హ్యాష్( *#62#)అనే కోడ్ ఉపయోగపడుతుంది. సాధారణంగా ఇక్కడ నెట్‌వర్క్ కంపెనీ నంబర్ కనిపిస్తుంది. అలా కాకుండా వేరే ప్రైవేట్ నంబర్ ఉంటే వెంటనే అప్రమత్తం కావాలి.

మరి ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా అంటే.. దానికోసం హ్యాష్ హ్యాష్ 002 హ్యాష్ (##002#)అనే మాస్టర్ కోడ్‌ను వాడాలి. ఈ కోడ్ డయల్ చేయగానే మీ ఫోన్లో ఎవరైనా సెట్ చేసిన అనవసరమైన కాల్ ఫార్వర్డింగ్ సెట్టింగ్స్ అన్నీ కూడా ఒక్కసారిగా డిలీట్ అయిపోతాయి.

వీటితో పాటు మన ఫోన్ సెట్టింగ్స్‌లోని ప్రైవసీ ఆప్షన్‌కు వెళ్లి.. ఏయే యాప్‌లు మీ కెమెరా, మైక్రోఫోన్‌లను వాడుతున్నాయో చెక్ చేసుకోవాలి. దీని వల్ల పర్సనల్ సమాచారానికి సేఫ్టీ ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version