Samsung Galaxy Z Flip 8 : ట్రెండీ లుక్‌తో అదుర్స్..మార్కెట్‌లో క్రేజీగా శాంసంగ్ ఫ్లిప్ ఫోన్లు

Samsung Galaxy Z Flip 8 : శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8 ప్రీమియం ఫీచర్లు, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సామర్థ్యాలతో మార్కెట్లోకి వచ్చింది.

Samsung Galaxy Z Flip 8

ఒకప్పుడు శాంసంగ్ ఫ్లిప్ ఫోన్లకు ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కీప్యాడ్‌తో మడతపెట్టేలా ఉండే శాంసంగ్ ఫ్లిప్ ఫోన్లు ట్రెండ్ సెట్ చేశాయి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త కంపెనీలు సరికొత్త స్మార్ట్ ఫోన్లతో ఎంట్రీ ఇవ్వడంతో శాంసంగ్ వెనుకబడిపోయింది.

కానీ తమను అంతర్జాతీయ మార్కెట్‌లో నిలబెట్టిన ఫ్లిప్ ఫోన్లతోనే మరోసారి ట్రెండ్ సెట్ చేయడానికి శాంసంగ్ సిద్ధమైంది. ఒకప్పుడు ట్రెండీ లుక్ , స్టైల్‌కు ప్రతీకగా నిలిచిన ఆ ఫోన్‌ల స్థానంలో అత్యాధునిక టెక్నాలజీతో గెలాక్సీ Z ఫ్లిప్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లతో శాంసంగ్ ఎంట్రీ ఇచ్చింది.

ఈ సిరీస్‌లో సరికొత్త మోడల్స్‌ను లాంఛ్ చేసింది. గెలాక్సీ జడ్‌ ఫోల్డ్‌ 8, గెలాక్సీ జడ్‌ ఫోల్డ్‌ 8 అల్ట్రా, గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌ 8లను అఫీషియల్‌గా విడుదల చేసింది. వీటితో పాటు గెలాక్సీ వాచ్‌ అల్ట్రా, గెలాక్సీ వాచ్‌ 9లను కూడా ఆవిష్కరించింది.

తాజాగా విడుదలైన శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8(Samsung Galaxy Z Flip 8) ప్రీమియం ఫీచర్లు, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సామర్థ్యాలతో మార్కెట్లోకి వచ్చింది. ఇది 4.1 అంగుళాల కవర్ డిస్‌ప్లే, 6.9 అంగుళాల ప్రధాన స్క్రీన్‌, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్‌తో అందుబాటులో ఉంది. దీని ధర సుమారు రూ. 1,24,999 నుంచి ప్రారంభమవుతుంది.

ఈ కొత్త ఫ్లిప్ ఫోన్లు అల్ట్రా-కాంపాక్ట్ డిజైన్‌తో పాటు పెద్ద కవర్ స్క్రీన్‌లు, అత్యంత పటిష్టమైన హింజ్ మెకానిజం, పవర్‌ఫుల్ ప్రాసెసర్లతో మార్కెట్‌లోకి వచ్చాయి. వీటికి ఏడేళ్ల ఓఎస్‌ అప్‌డేట్లు, ఏడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని శాంసంగ్‌ ప్రకటించింది.

Samsung Galaxy Z Flip 8

కాంపాక్ట్ సైజ్, ప్రత్యేకమైన ఫ్యాషన్ లుక్, డిజిటల్ డిటాక్స్ , నోస్టాల్జియా ఈ ఫ్లిప్ ఫోన్లకు ఎట్రాక్షన్‌గా చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌ల వాడకంతో విసిగిపోయిన యువత , సాధారణ వినియోగదారులు వీటివైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇవి చిన్నవిగా మడతపెట్టడానికి వీలుగా ఉండటం వల్ల జేబులో లేదా చిన్న బ్యాగుల్లో ఈజీగా తీసుకెళ్లొచ్చు.

ఈ ఫోన్‌లు చూడటానికి చాలా ఆకర్షణీయంగా, విభిన్నంగా ఉండటంతో ఈ తరం యువత దీనిని ఒక ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా భావిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ల ద్వారా వచ్చే అనవసరమైన నోటిఫికేషన్‌లు, సోషల్ మీడియా వాడకం తగ్గించుకోవడానికి చాలా మంది వీటిని ఉపయోగిస్తున్నారు. ఫోన్ మాట్లాడటం, మెసేజ్ చేసుకోవడం వంటి బేసిక్ అవసరాలకు ఇవి పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. వీటి బ్యాటరీ కూడా చాలా ఎక్కువ కాలం వస్తుండడంతో వీటికి క్రేజ్ మరింత పెరిగింది.

Official Product Page : Samsung Galaxy Z Series

Ex-Servicemen : రిటెన్ టెస్ట్‌లు, ఫిజికల్ టెస్ట్‌లు లేకుండానే ఉద్యోగాలు.. మాజీ సైనికులకు గోల్డెన్ ఛాన్స్

Exit mobile version