IT Corridor Traffic : బయోడైవర్సిటీ టు నాలెడ్జ్ సిటీ..ఐటీ కారిడార్‌లో త్వరలోనే వన్‌-వే లూప్ రౌండ్..

IT Corridor Traffic : హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌కు చెక్ పెట్టడానికి సైబరాబాద్ పోలీసులు 'వన్-వే లూప్' ప్లాన్ చేస్తున్నారు. బయోడైవర్సిటీ, మైండ్‌స్పేస్, ఐకియా పరిసరాల్లో కొత్త రూట్ మ్యాప్ అమలుపై సీపీ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.

IT Corridor Traffic

హైదరాబాద్‌ మహానగరంలోని ఐటీ రంగానికి గుండెకాయ వంటి ఐటీ కారిడార్‌లో ప్రతీరోజూ నరకం చూపిస్తున్న ట్రాఫిక్ రద్దీకి పర్మినెంట్ సొల్యూషన్ చూపించడానికి సైబరాబాద్ పోలీసులు నడుం బిగించారు. హైటెక్ సిటీ, బయోడైవర్సిటీ జంక్షన్‌, నాలెడ్జ్ సిటీ పరిసరాల్లో వెహికల్స్ ట్రాఫిక్‌లో గంటల తరబడి నిలిచిపోకుండా రాకపోకలను ఈజీ చేయడానికి ఒక అదిరిపోయే ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నారు.

ఈ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా వన్‌-వే లూప్‌ అనే విధానం ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు తెర మీదకు తీసుకొచ్చారు. బయోడైవర్సిటీ జంక్షన్‌ నుంచి స్టార్ట్ అయి ఐకియా రోటరీ, రహేజా మైండ్‌స్పేస్‌ సి-గేట్‌, నాలెడ్జ్ సిటీ, డల్లాస్ సెంటర్ మీదుగా మై హోమ్‌ భూజా ఏరియాకు చేరుకుని.. అక్కడ నుంచి మళ్లీ బయోడైవర్సిటీ జంక్షన్‌కు రౌండ్‌గా వెళ్లేలా ఈ రూట్‌ను డిజైన్ చేస్తున్నారు. ఈ ప్లాన్ కనుక పట్టాలెక్కితే మెయిన్ సర్కిల్స్ వద్ద వెహికల్స్ గంటల తరబడి నిలిచిపోకుండా కంటిన్యూగా సాగుతూ ముందుకు వెళ్లిపోవచ్చు.

ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో వెహికల్స్(IT Corridor Traffic) స్పీడ్‌ను అడ్డుకుంటున్న నాలుగు కీలక బాటిల్‌నెక్‌ పాయింట్లను గుర్తించిన సైబరాబాద్ పోలీస్ అధికారులు వాటిని తొలగించే పనిలో పడ్డారు. దీనికి సంబంధించి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, జాయింట్ సీపీ సున్ ప్రీత్ సింగ్‌తో పాటు కొంతమంది ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు.

సిమ్యులేషన్ టెస్టులతో పాటు ఐటీ కంపెనీల ప్రతినిధుల అభిప్రాయాలు సేకరించి, ముందస్తు ట్రాఫిక్ అడ్వైజరీలు జారీ చేశాక.. ఈ వన్-వే సిస్టమ్‌ను స్టేజీలవారీగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్లాన్ కనుక అమలయితే ఐటీ ఉద్యోగులు, డైలీ అదే మార్గం నుంచి ప్రయాణించేవారికి నిజంగా ఇది పెద్ద గుడ్ న్యూస్ అవుతుంది.

Maturity : నిజమైన మెచ్యూరిటీ అంటే ఏంటి? ఎమోషనల్ మెచ్యూరిటీ ఉన్నవారి ప్రవర్తన ఎలా ఉంటుంది?

↑
Exit mobile version