Nani
దసరా మూవీ భారీ హిట్ తర్వాత నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో మోస్ట్ క్రేజియెస్ మూవీ ది ప్యారడైజ్.. సెప్టెంబర్ 24వ తేదీన థియేటర్లలోకి రాబోతోంది. ఈ మూవీకి తెలంగాణ ప్రభుత్వం ఒక రోజు ముందే అంటే సెప్టెంబర్ 23వ తేదీన పెయిడ్ ప్రీమియర్లకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది.
ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్‌లో రూ.7 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోతున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే సరిగ్గా ఈ సమయంలోనే హీరో నాని ఎక్స్ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అలాగే తెలంగాణ పోలీసులకు పెట్టిన విజ్ఞప్తి హాట్ టాపిక్‌గా మారింది.
హైదరాబాద్ లోకల్ మూవీ హబ్ అయిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్‌లో జనరల్ ఆడియన్స్‌తో కలిసి ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షో చూడాలని ఉందని నాని రిక్వెస్ట్ చేశారు. తాము పడిన కష్టానికి థియేటర్‌లో విజిల్స్, పేపర్ల గోల మధ్య ఆడియన్స్ రెస్పాన్స్ లైవ్‌గా చూస్తేనే యాక్టర్‌గా తనకు పూర్తి సంతృప్తి దక్కుతుందని అన్నారు. భారీ క్రౌడ్ వస్తుందనే విషయంపై క్లారిటీ ఉన్న నాని.. గవర్నమెంట్ విధించే ప్రతీ ఒక్క సేఫ్టీ రెగ్యులేషన్స్, ప్రోటోకాల్స్ కచ్చితంగా పాటిస్తామని అలాగే సెక్యూరిటీ పరంగా కూడా ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటామని మాటిచ్చారు.
అయితే నానికి రేవంత్ ప్రభుత్వం నుంచి పర్మిషన్ రావడం అంత ఈజీ కాదనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో నడుస్తోంది. గతంలో ‘పుష్ప 2’ ప్రీమియర్ షో టైమ్‌లో హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన చేదు అనుభవమే దీనికి మెయిన్ రీజన్. అల్లు అర్జున్‌ను చూడటానికి ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగి ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం, వారి కొడుకు తీవ్రంగా గాయపడటం పెద్ద కలవరాన్నే సృష్టించింది. ఆ ఘటన తీవ్ర దుమారాన్ని రేపడమే కాకుండా రేవంత్ సర్కార్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అల్లు అర్జున్ ఇదే ఘటనపై కోర్టు కేసులు,పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ ‘పుష్ప 2’ ఇన్సిడెంట్‌ను దృష్టిలో ఉంచుకుంటే, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వంటి రద్దీ ఉన్న ప్రాంతంలో నాని లాంటి హీరో థియేటర్‌కు వస్తే అక్కడ క్రౌడ్‌ను కంట్రోల్ చేయడం కంట్రోల్ చేయడం కత్తిమీద సామే అవుతుంది. పోలీసులు మరోసారి అలాంటి రిస్క్ తీసుకోవడానికి అస్సలు రెడీగా లేరు.
అయితే ఒకవేళ నాని(Nani)కి పర్మిషన్ ఇచ్చినా.. స్ట్రిక్ట్ కండీషన్స్ విధించడం, థియేటర్ పరిసరాల్లోకి భారీ భద్రత నడుమ చాలా తక్కువ మంది ఆడియన్స్‌ను మాత్రమే అనుమతించే అవకాశం ఉంది. గతం నేర్పిన పాఠాలతో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ పోలీసులు నాని(Nani) కోరికను తీరుస్తారా లేదా సెక్యూరిటీ రీజన్స్ చూపి నో చెబుతారా అన్నది చూడాలి.
Hon’ble Chief Minister Shri @revanth_anumula Garu, Hon’ble Minister of Cinematography Shri @KomatireddyKVR Garu & the respected officials of @TelanganaCOPs.
This is a request from a fan of cinema and, more importantly, someone who has enjoyed cinema at its very best from a very…
— Nani (@NameisNani) September 22, 2026
Cabbage Storage : ఫ్రిడ్జ్‌లో పెట్టినా క్యాబేజీ కుళ్లిపోతోందా? ఈ చిన్న ట్రిక్ తెలుసుకోండి..
