Rain Alert
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు అదే జోరును కంటిన్యూ చేస్తున్నాయి. అయితే తాజాగా రుతుపవనాల కదలికలు తీవ్రం కావడంతో పాటు, బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం అలాగే దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం తోడవడంతో తెలంగాణలో రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
ముఖ్యంగా తెలంగాణలోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. వాతావరణ శాఖ అందించిన తాజా బులిటెన్ ప్రకారం.. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి.
మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి విస్తారంగా వానలు పడతాయని అంచనా వేశారు. ఇక వర్షం పడే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల తుపాను వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, చెట్ల కింద లేదా కరెంట్ పోల్స్ కింద నిలబడవద్దని అధికారులు హెచ్చరించారు.
హైదరాబాద్ నగరవాసులు కూడా ఈరోజు కాస్త అలర్ట్‌గా ఉండాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో సిటీలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లబడి, ఉరుములతో కూడిన మోస్తరు వర్షం దంచికొట్టే అవకాశం ఉంది.
అలాగే సోమవారం ఆకాశం పూర్తిగా నల్లటి మబ్బులతో మేఘావృతమై ఉంటుందని అధికారులు చెప్పారు. అందుకే ఆఫీసుల నుంచి ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో.. ట్రాఫిక్ జామ్‌లు లేదా నీళ్లు నిలిచే ప్రమాదం ఉంది కాబట్టి బైకర్లు, కారు డ్రైవర్లు దీని ప్రకారం ప్లాన్ చేసుకుని బయలుదేరడం మంచిది.
Gold Price : పసిడి ప్రియులు ఎగిరి గంతేసే వార్త..3 రోజుల్లోనే రూ. 6 వేలకు పైగా డౌన్..
