Rent A Boyfriend
మీతో సరదాగా ఓ కాఫీ తాగడానికో, లేదా ఇష్టమైన మూవీకి రావడానికో, లేదా షాపింగ్ చేయడానికో ఒక అందమైన బోయ్ ఫ్రెండ్ తోడుగా కావాలా? అదీ ఏకంగా 50 పర్సంట్ ఆఫర్‌తో అంటే చాలామంది అమ్మాయిలు ఒక్క క్షణం అయినా టెంప్ట్ అవకుండా ఉండలేరు.
ముఖ్యంగా ఒంటరిగా ఉండే అమ్మాయిలు, లోన్లీగా ఫీలయ్యే యువతుల ఒంటరితనాన్ని క్యాష్ చేసుకోవడానికి సైబర్ కేటుగాళ్లు రంగంలోకి దింపిన లేటెస్ట్ స్కామ్ పేరే రెంట్ ఏ బోయ్‌ఫ్రెండ్ (Rent A Boyfriend). ఈ పేరుతో ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్‌లలో హీరోల్లాంటి యువకుల బొమ్మలు పెట్టి, బోయ్‌ఫ్రెండ్స్ రెంట్‌కు దొరుకుతారంటూ వల వేస్తున్నారు.
ఇలాంటి మాయగాళ్ల వెనుక పెద్ద క్రైమ్ నెట్‌వర్కే దాగి ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సంచలన హెచ్చరికలను జారీ చేశారు. ఒకసారే ఈ థ్రిల్ కోసం మెసేజ్ చేస్తే ఇక జేబులు గుల్ల అవ్వడమే కాదు..ఆ అమ్మాయిల ప్రైవసీ కూడా బజారున పడుతుందని అన్నారు.
ఈ సైబర్ స్కామర్లు AI , ఇంటర్నెట్ నుంచి దొంగిలించిన అందమైన అబ్బాయిల ఫోటోలను ప్రొఫైల్స్‌గా సెట్ చేస్తారు. తర్వాత అమ్మాయిలను టార్గెట్ చేస్తూ.. కాఫీ డేట్లు, సినిమా హాల్స్, షాపింగ్ , ఫంక్షన్లకు తోడుగా రావడానికి తక్కువ కాస్ట్‌కే ప్యాకేజీలు ఇస్తామంటూ 50 శాతం డిస్కౌంట్ అని తెగ యాడ్స్ ఇస్తుంటారు.
ఈ అట్రాక్ట్ చేసే పోస్టర్లను చూసి యువతుల నుంచి మెసేజ్ చేయగానే, మాయగాళ్ల అసలు నాటకం మొదలు పెడతారు. బుకింగ్ కన్ఫర్మేషన్, సెక్యూరిటీ డిపాజిట్, అడ్వాన్స్ పేమెంట్ అంటూ క్యూఆర్ కోడ్స్ ద్వారా వారి డబ్బులు అకౌంట్లలోకి పడగానే, ఆ వెంటనే వాటిని బ్లాక్ చేసి మాయమవుతారు.
డబ్బులు పోవడమే కాకుండా, అమ్మాయిలు చేసే చాటింగ్ ద్వారా సేకరించిన పర్సనల్ ఫోటోలు, ఫోన్ నెంబర్లను అడ్డు పెట్టుకుని ఆ తర్వాత బ్లాక్‌మెయిల్ చేసే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఆన్‌లైన్‌లో మాయమాటలను నమ్మి కొత్త వ్యక్తులను డైరెక్టుగా కలవడానికి వెళ్తే ..ఫిజికల్ ట్రాప్స్‌లో కూడా ఇరుక్కునే అవకాశం ఉంది.
కాబట్టి ఇలాంటి ఫేక్ డేటింగ్ ఆఫర్లను, ముఖ్యంగా డేటింగ్ యాప్స్ వంటివి అస్సలు నమ్మొద్దని, తల్లిదండ్రులు పిల్లల సోషల్ మీడియా యాక్టివిటీస్‌పై కన్నేసి ఉంచాలని సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ మోసాల బారిన పడితే ఏమాత్రం భయపడకుండా వెంటనే 1930 నెంబర్‌కు కాల్ చేయాలని లేదా సైబర్‌క్రైమ్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ( cybercrime.gov.in) పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని ఎక్స్ వేదికగా సీపీ సూచించారు.
అమ్మాయిలూ.. రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వల.. జాగ్రత్త!!
"ఒంటరితనంతో బాధపడుతున్నారా? మీతో కాఫీ తాగడానికి, సినిమాకెళ్లడానికి అందమైన అబ్బాయి కావాలా? అది కూడా 50 శాతం ఆఫర్లతో!".. సోషల్ మీడియాలో రకరకాల ఆఫర్ల పేరుతో కలర్ఫుల్గా కనిపిస్తున్న ఈ పోస్టర్ల వెనుక పెద్ద సైబర్ మోసం దాగి ఉంది.… pic.twitter.com/E7O1mgwUip
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) August 8, 2026
Ghee : నెయ్యి తింటే లావవుతారా? లేక హెల్త్‌కు బూస్ట్ అవుతుందా? డాక్టర్లు ఏం చెబుతున్నారు?
