Just TelanganaJust Andhra Pradesh

Rain:ఏపీ, తెలంగాణలో వాన కబురు..

Rain:రుతుపవనాల జోరుకు తోడు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది.

Rain:తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లని కబురు వినిపిస్తోంది. రుతుపవనాల జోరుకు తోడు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ద్రోణి కూడా ఈ వర్షాలకు బలాన్ని చేకూర్చనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వానలు అన్నదాతలకు ఆశలు నింపగా, ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Rain

రుతుపవనాల సమయంలో వర్షాలు ఆలస్యమైనా, ఈ భారీ వర్షాలు రైతులకు మాత్రం ఇది నిజంగా శుభవార్త. ఈ వానలు సాగుకు ఎంతో దోహదపడనున్నాయి. ముఖ్యంగా వరి, పత్తి వంటి పంటలకు ఈ వర్షాలు ప్రాణం పోస్తాయి. అయితే ఈ వర్షాలు శుభవార్త అయినా, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. పిడుగులతో కూడిన వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున, బయట పనులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయి. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తెలంగాణ(Telangana)లోని జగిత్యాల, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్ధిపేట, హనుమకొండ, యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి. దీంతో తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.

ముఖ్యంగా హైదరాబాద్‌(Hyderabad)లో నిన్న భారీ వర్షానికి నగరం అల్లకల్లోలం అయింది. వాహనదారులు గంటల కొద్దీ ట్రాఫిక్‌లో ఇరుక్కున్నారు. కాగా ఈరోజు కూడా ఏపీ , తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధకారులు హెచ్చరిస్తున్నాను. పట్టణ ప్రాంతాల్లో నీరు నిలిచిపోయే అవకాశం ఉంటుంది కాబాట్టి.. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. పవర్ సప్లైకు అంతరాయాలు ఏర్పడవచ్చు కాబట్టి అందుకు సిద్ధంగా ఉండాలని… అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లాలని చెబుతున్నారు. మరోవైపు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు .

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button