Just EntertainmentLatest News

Ormax:పాన్ ఇండియాలో మనోళ్ల క్రేజ్.. టాప్ హీరో డార్లింగే

Ormax: ఓర్మాక్స్ (Ormax) రిలీజ్ చేసిన మోస్ట్ పాపులర్ సెలబ్రిటీస్ లిస్ట్ (జూన్ 2025) లో మన సౌత్ స్టార్లు ఓ రేంజ్‌లో రికార్డులు బ్రేక్ చేశారు

Ormax:ఆల్ ఇండియాలో ఇప్పుడు మన స్టైలే నడుస్తోంది!. లేటెస్ట్‌గా ఓర్మాక్స్ (Ormax) రిలీజ్ చేసిన మోస్ట్ పాపులర్ సెలబ్రిటీస్ లిస్ట్ (జూన్ 2025) లో మన సౌత్ స్టార్లు ఓ రేంజ్‌లో రికార్డులు బ్రేక్ చేశారు. ముఖ్యంగా, హీరోల కేటగిరీలో రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి నంబర్ 1 పొజిషన్ కొట్టేశాడు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్, కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌లను కూడా బీట్ చేసి, మన డార్లింగ్ టాప్ స్పాట్‌లో నిలవడం నిజంగా బిగ్గెస్ట్ న్యూస్ అనే చెప్పొచ్చు.

latest Ormax 2025 list..

టాప్ 10 హీరోల్లో సగం మంది మన హీరోలే.ఓర్మాక్స్ లిస్ట్‌లో చాలాసార్లు టాప్ పొజిషన్ అందుకున్న అతి కొద్ది మంది హీరోల్లో ప్రభాస్ ఒకరు. ఇది అతనికి ఉన్న హ్యూజ్ ఫ్యాన్ బేస్, ప్యాన్ ఇండియా రీచ్‌కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మన హీరోల హవా ఇక్కడితో ఆగిపోలేదు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన స్టైలిష్ పర్‌ఫార్మెన్స్‌తో థర్డ్ ప్లేస్ సాధించాడు.

సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఆరో ప్లేస్‌లో ఉన్నాడు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సెవెంత్ ప్లేస్ అందుకున్నాడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎయిత్ ప్లేస్‌లో నిలిచాడు.

న్యాచురల్ స్టార్ నాని టెన్త్ ప్లేస్‌లో ఉన్నాడు.

మొత్తంగా, టాప్ 10 మోస్ట్ పాపులర్ హీరోల లిస్ట్‌లో ఆరుగురు మన హీరోలే ఉండడం సౌత్ సినిమా పవర్ ఏంటో క్లియర్‌గా చూపిస్తోందంటున్నారు సినీ క్రిటిక్స్.

ఓర్మాక్స్ టాప్ 10 హీరోస్ లిస్ట్ (జూన్ 2025):

ప్రభాస్, దళపతి విజయ్, అల్లు అర్జున్ , షారుక్ ఖాన్, అజిత్ కుమార్ ,మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్, అక్షయ్ కుమార్ ,నాని

హీరోయిన్లలో సమంతే టాప్‌గా నిలిచింది. మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ లిస్ట్‌లో స్టార్ హీరోయిన్ సమంత మరోసారి టాప్ పొజిషన్ కైవసం చేసుకుంది. చాలాసార్లు నంబర్ 1 గా నిలిచిన సామ్, రీసెంట్‌గా సినిమాలు పెద్దగా చేయకపోయినా, ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉండడం ఆమెకున్న అన్‌బీటబుల్ క్రేజ్‌ను ప్రూవ్ చేస్తోంది. లాస్ట్‌గా ఆమెసిటాడెల్: హనీ బన్నీవెబ్ సిరీస్‌తో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసింది.

ఓర్మాక్స్ టాప్ 10 హీరోయిన్స్ లిస్ట్ (జూన్ 2025):

సమంత, ఆలియా భట్, దీపికా పదుకొణె, త్రిష, కాజల్ అగర్వాల్ ,సాయి పల్లవి, నయనతార,  రష్మిక మందన్న, కీర్తి సురేశ్, తమన్నా భాటియా

గతంలో రష్మిక మందన్న వరుసగా మూడు నెలల పాటు ఓర్మాక్స్ పాపులర్ సెలబ్రిటీస్ లిస్ట్‌లో నంబర్ వన్‌లో నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆమె ఎయిత్ ప్లేస్‌లో ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button