Just EntertainmentJust Andhra Pradesh

Hari Hara Veeramallu:పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండుగలాంటి వార్త

Hari Hara Veeramallu:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'హరి హర వీరమల్లు' రిలీజ్‌కి రెడీ అయిపోయింది.

Hari Hara Veeramallu:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘హరి హర వీరమల్లు’ రిలీజ్‌కి రెడీ అయిపోయింది. చాలా కాలం తర్వాత పవన్ నుంచి వస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ కోసం ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్‌గా ఉన్నారు. జూలై 24న పాన్ ఇండియా ( Pan India) లెవెల్‌లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. రీసెంట్‌గా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన టీమ్‌కి, ఇప్పుడు ఏపీ సర్కార్ నుంచి ఊహించని గుడ్ న్యూస్ అందింది. ఇది పవన్ ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్‌ లాంటిదే.

Hari Hara Veeramallu

 

‘హరి హర వీరమల్లు( Hari Hara Veeramallu) మూవీ కోసం ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకునేందుకు కొన్ని స్పెషల్ పర్మిషన్స్ ఇచ్చింది. ఇది సినిమా టీమ్‌కి, ముఖ్యంగా నిర్మాతకు భారీగా కలిసొస్తుంది. జూలై 23న రాత్రి 9 గంటలకు జరిగే ప్రీమియర్ షోకి ఒక్కో టికెట్‌ను రూ.600 వరకు అమ్ముకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా దీనికి జీఎస్టీ ఎక్స్‌ట్రా ఉంటుంది.

సినిమా రిలీజ్ అయిన జూలై 24 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు, అంటే పది రోజుల పాటు, థియేటర్లలో, మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలు పెంచుకునేందుకు పర్మిషన్ వచ్చింది.నార్మల్ థియేటర్లలో లోయర్ క్లాస్ టికెట్ ధరను రూ.100 వరకు, అప్పర్ క్లాస్ టికెట్ ధరను రూ.150 వరకు పెంచుకోవచ్చు. మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరను ఏకంగా రూ 200 వరకు పెంచుకునేందుకు అవకాశం కల్పించారు.

మామూలుగా అయితే టికెట్ ధరల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం కఠినమైన రూల్స్ పాటిస్తుంది. కానీ, ‘హరి హర వీరమల్లు’ విషయంలో 2022లో వచ్చిన జీవో-13 లోని పరిమితుల నుంచి మినహాయింపు ఇచ్చింది. నిర్మాత ఏ.ఎం. రత్నం చేసిన రిక్వెస్ట్‌ను ప్రభుత్వం పాజిటివ్‌గా తీసుకొని ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ ధరల పెంపును సరిగ్గా అమలు చేయడానికి, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, లైసెన్సింగ్ ఆఫీసర్లు, పోలీస్ కమిషనర్లు పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల సినిమా మేకర్స్‌కి ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది సినిమా బడ్జెట్‌ను, నిర్మాణ వ్యయాన్ని కవర్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది.

ఇక..హరి హర వీరమల్లులో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మొదట క్రిష్ దర్శకత్వం వహించగా, ఆ తర్వాత జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. చాలా నెలలుగా ఫాస్ట్ పేస్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పై రచ్చ చేయడానికి రెడీ అయ్యింది.

పవన్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో తెలిసిందే. ఇప్పుడు ఈ టికెట్ ధరల పన్మిషన్‌తో, సినిమా కలెక్షన్స్‌కి కూడా మంచి బూస్ట్ వస్తుందని ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ భావిస్తున్నారు. మరి పవన్ మేనియా ఏ రేంజ్‌లో ఉంటుందో చూడటం ఒకటే ఉంది.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button