Just NationalJust International

solar eclipse: పగలే రాత్రయితే..ఆగస్ట్ 2న అదే జరుగుతుందట..

solar eclipse : పట్టపగలు సూర్యుడు మాయమై, ప్రపంచం మొత్తం చీకటిగా మారిపోతే ఎలా ఉంటుంది?

solar eclipse : పట్టపగలు సూర్యుడు మాయమై, ప్రపంచం మొత్తం చీకటిగా మారిపోతే ఎలా ఉంటుంది? అది కూడా ఏకంగా 6 నిమిషాల 23 సెకన్ల పాటు మొత్తం చీకటిగా మారిపోతుంది. వినడానికి థ్రిల్లింగ్‌గా ఉంది కదూ? అయితే ఇది కథలో భాగం కాదు..సినిమా స్టోరీ అంతకంటే కాదు.. 2027 ఆగస్టు 2న నిజంగానే జరగబోతోంది.

దాదాపు వందేళ్ల తర్వాత ఇలాంటి అద్భుతమైన, అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం (Total Solar Eclipse) ఆవిష్కృతం కానుంది. ఖగోళ శాస్త్రవేత్తలు దీన్ని ‘గ్రేట్ నార్త్ ఆఫ్రికన్ ఎక్లిప్స్’ అని పిలుస్తున్నారు. ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైన సూర్యగ్రహణం ఇదేనని వారు చెబుతున్నారు.

Rare solar eclipse on August 2

సూర్యగ్రహణం అనేది ఒక అద్భుతమైన ఖగోళ సంఘటన. ఇది మూడు గ్రహాలు – సూర్యుడు(sun), చంద్రుడు(Moon), భూమి(Earth) ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే..సూర్యుడికి, భూమికి మధ్యలోకి చంద్రుడు వచ్చినప్పుడు, చంద్రుడు సూర్యుడి కాంతిని అడ్డుకుంటాడు. దీనివల్ల భూమిపై కొంత భాగం లేదా పూర్తిగా చీకటిగా మారుతుంది.

చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేసినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం (Total Solar Eclipse) ఏర్పడుతుంది. ఈ సమయంలో పగటిపూట కూడా ఆకాశం చీకటిగా మారిపోతుంది. నక్షత్రాలు కనిపించవచ్చు, వాతావరణం చల్లబడుతుంది, జంతువులు రాత్రి అయ్యిందని భావించి వింతగా ప్రవర్తించే సందర్భాలు కూడా ఉన్నాయి.

2027 ఆగస్టు 2న ఏం జరుగుతుంది?

2027 ఆగస్టు 2న (August2) సంభవించబోయే సూర్యగ్రహణం దాదాపు 6 నిమిషాల 23 సెకన్ల పాటు భూమిపై చీకటిని నింపుతుంది. ఇది ఈ శతాబ్దంలోనే అత్యంత ఎక్కువ సమయం పాటు ఉండే సంపూర్ణ సూర్యగ్రహణం. శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం, దీని తర్వాత ఇంత సుదీర్ఘమైన సంపూర్ణ సూర్యగ్రహణం మళ్లీ 2114 వరకు అంటే దాదాపు మరో 87 సంవత్సరాల వరకు కనిపించదు. ప్రపంచంలోని వివిధ ఖండాలలో నివసిస్తున్న కోట్లాది మంది ప్రజలు ఈ దృశ్యాన్ని చూడగలుగుతారు.

దాదాపు వందేళ్ల క్రితం, 1937 జూన్ 8న 7 నిమిషాల 4 సెకన్ల పాటు సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. ఇది 2027లో రాబోయే గ్రహణం కంటే ఎక్కువ సమయం పాటు కొనసాగింది. అయితే, 2027 నాటి గ్రహణం 2114 వరకు మళ్లీ రాదు కాబట్టి, ఇది అత్యంత అరుదైనది.

1973 జూన్ 30సుమారు 7 నిమిషాల 4 సెకన్ల పాటు గ్రహణం కొనసాగింది. ఆఫ్రికాలో చాలా ప్రాంతాల్లో కనిపించింది. అలాగే 2009 జూలై 226 నిమిషాల 39 సెకన్ల పాటు సూర్యగ్రహణం కొనసాగింది. ఇండియా, చైనా సహా ఆసియాలో కనిపించింది. ఇది 21వ శతాబ్దంలో ఇప్పటివరకు వచ్చిన అతి సుదీర్ఘ గ్రహణం.

ప్రతి సంపూర్ణ సూర్యగ్రహణం ఎక్కువ నిడివి ఉండదు. చాలా గ్రహణాలు 2-4 నిమిషాల లోపే ఉంటాయి. ఉదాహరణకు, 2017లో ఉత్తర అమెరికాలో వచ్చిన సూర్యగ్రహణం దాదాపు 2 నిమిషాల 40 సెకన్ల పాటు మాత్రమే కొనసాగింది.

ప్రతి సంవత్సరం కనీసం 2 సూర్య గ్రహణాలు వస్తాయి, గరిష్టంగా 5 సూర్య గ్రహణాలు రావచ్చు. అయితే, ఒకే ప్రాంతంలో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించడం చాలా అరుదు. దాదాపు ప్రతి 375 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.

2027 ఆగస్టు 2న జరగబోయే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఖగోళ ప్రియులకు, సామాన్యులకు ఒక అరుదైన, మరపురాని దృశ్యాన్ని అందించనుంది. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన అద్భుతమైన దృశ్యం కాబట్టి.. డోంట్ మిస్ ఇట్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button