sandals:ఆ గ్రామస్తులు ఇప్పటికీ చెప్పులు వేసుకోరట..
sandals:చుట్టుపక్కల గ్రామాల్లో ఈ ఊరి గురించి వింతగా చెప్పుకుంటారు. కేవలం 25 కుటుంబాలు మాత్రమే నివసించే ఈ గ్రామం(village)లో, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరూ చెప్పులు వేసుకోరు.

sandals:ఒకప్పుడు చెప్పులు అనేది డబ్బున్న వాళ్లకే పరిమితం. కానీ ఇప్పుడు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు, అందరి కాళ్లకూ రక్షణగా, ఫ్యాషన్‌గా, స్టేటస్‌గా రకరకాల షూస్, చెప్పులు వాడేస్తున్నారు. ఇంట్లో కూడా చెప్పులు(sandals) వేసుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది. కానీ, మీరు వింటే ఆశ్చర్యపోతారు… చిత్తూరు జిల్లాలో ఒక గ్రామం ఉంది, అక్కడ గ్రామస్తులు ఎవరూ చెప్పులు వేసుకోరు. అంతే కాదు, ఆ ఊళ్లోకి ఎవరైనా వెళ్తే, గ్రామం బయటే చెప్పులు వదిలేసి, ఒట్టి కాళ్లతోనే లోపలికి వెళ్లాలి. వినడానికి వింతగా ఉన్నా, ఇది నమ్మలేని నిజం!
sandals
తిరుపతికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో, పాకాల మండలం ఉప్పరపల్లి పంచాయతీ పరిధిలో వేమన ఇండ్లు(Vemana Indlu) అనే ఒక చిన్న గ్రామం ఉంది. కొన్ని తరాలుగా ఇక్కడి గ్రామస్తులు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. అందుకే చుట్టుపక్కల గ్రామాల్లో ఈ ఊరి గురించి వింతగా చెప్పుకుంటారు. కేవలం 25 కుటుంబాలు మాత్రమే నివసించే ఈ గ్రామం(village)లో, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరూ చెప్పులు వేసుకోరు.
“కలెక్టర్ వచ్చినా సరే, చివరికి ముఖ్యమంత్రి వచ్చినా సరే… ఊరి బయట చెప్పులు విడిచిపెట్టే గ్రామంలోకి రావాల్సిందే” అని గ్రామస్తులు గర్వంగా చెబుతారు. ఇది తమ తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న పవిత్ర సంప్రదాయమని వారు బలంగా నమ్ముతారు.
వేమన ఇండ్లు గ్రామంలో నివసించే వారంతా పాలవేకారి, దొరవర్లు కులాలకు చెందిన వారు. వీరందరూ తమ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. గ్రామస్థులు చెప్పే దాని ప్రకారం, తమ ముత్తాతలు వెంకటేశ్వర స్వామికి మొక్కుకోవడం వల్లే ఇప్పటికీ చెప్పులు వేసుకోకుండా ఉన్నారట. గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి, గంగమ్మ తల్లికి కూడా ప్రత్యేక పూజలు చేస్తారు.
అంతేకాదు, వేమన ఇండ్లు గ్రామంలోకి వచ్చే కొత్తవారిని వీరు కనీసం తాకడానికి కూడా ఇష్టపడరు. ఒకవేళ వీరు బయటకు వెళ్లాల్సి వస్తే, ఎన్ని రోజులు బయట ఉన్నా కూడా బయటి ఆహారాన్ని ముట్టుకోరు. ఇంటి నుంచి వండుకుని వెళ్లిన ఆహారాన్నే తీసుకుంటారు, లేదా తిరిగి ఇంటికి వచ్చాకే భోజనం చేస్తారు. ఆశ్చర్యకరంగా, తమ ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుపతికి కూడా ఈ గ్రామస్తులు వెళ్లరట.
వేమన ఇండ్లు గ్రామంలో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే, వారు ఊళ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు చేస్తారు తప్ప, ఆసుపత్రికి మాత్రం వెళ్లరు. మరీ వింతగా అనిపించే విషయం ఏమిటంటే, కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా ఈ గ్రామంలో ఎవరూ వ్యాక్సిన్ తీసుకోలేదట. తమ వెంకన్నే తమ ప్రాణాలను కాపాడతాడని వారు అంత బలంగా నమ్ముతారని అనడానికి ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి..
ఈ గ్రామంలోని పిల్లలు కూడా పెద్దలు చెప్పినట్లే తాతముత్తాతల సంప్రదాయాలను పాటిస్తారు. అయితే, ఈ గ్రామంలోని ఆచారాలు, సంప్రదాయాలను చిన్నపిల్లలపై కూడా రుద్దడాన్ని కొంతమంది విమర్శిస్తున్నారు. ఇది మూఢనమ్మకమని, పిల్లల భవిష్యత్తుకు మంచిది కాదని ఆరోపిస్తున్నారు.