అందమైన చర్మం కోసం ఈజీ  చిట్కాలు

సల్ఫేట్ లేని ఫేస్ వాష్‌తో రోజూ కనీసం రెండుసార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

రోజుకు 8-10 గ్లాసుల నీళ్లు తాగాలి. కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది.

విటమిన్-సి (నిమ్మకాయ), విటమిన్-ఇ (బాదం) వంటి పోషకాలున్న ఆహారం తీసుకోవాలి.

తేనె, నిమ్మరసం మిశ్రమం చర్మాన్ని శుభ్రం చేసి, మృత కణాలను తొలగిస్తుంది.

పసుపు, శనగపిండి ప్యాక్ వల్ల పసుపులోని యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలను నివారిస్తాయి.

అలోవెరా జెల్: ముఖంపై మంట, ఎరుపుదనం ఉన్నప్పుడు కలబంద జెల్ వాడితే మంచి ఉపశమనం లభిస్తుంది.

రోజుకు 7-8 గంటలు నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.