మెదడు చురుకుగా పనిచేయడానికి ఉపయోగపడే ఫ్లేవనాయిడ్స్  ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.

క్యారెట్లు, యాపిల్స్, స్ట్రాబెర్రీలలో ఉండే బీటా కెరోటిన్, ఆంథోసైనిన్ వంటి పోషకాలు జ్ఞాపకశక్తిని పెంచుతాయి.

బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, ఎర్ర ద్రాక్ష వంటి బెర్రీ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెమరీ పవర్‌ను పెంచుతాయి.

కమలా పండ్లలోని ఫ్లేవనాయిడ్స్ మెదడుకు మేలు చేస్తాయి.

ఎర్ర క్యాబేజీలో ఉండే ఫ్లేవనాయిడ్స్ మెదడు ఆరోగ్యానికి గొప్పగా సహాయపడతాయి.

సోయాలో ఉండే ఫ్లేవనాయిడ్స్ మెదడును ప్రమాదకరమైన వైరస్‌ల నుంచి రక్షించి, ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి.