ఈ వ్రతంలో వాయినం ఇవ్వడం చాలా ముఖ్యం.వాయినంతోనే వ్రతం పరిపూర్ణంగా ముగుస్తుందని నమ్మకం.

వాయినం ఇవ్వడం వల్ల ముత్తైదువుల నుంచి దీర్ఘ సుమంగళి యోగానికి ఆశీస్సులు లభిస్తాయి.

వాయినం ఇచ్చి పుచ్చుకోవడం వల్ల మంచి అదృష్టం, శుభాలు కలుగుతాయి.

తాంబూలంలో పసుపు, కుంకుమ, గాజులు, పూలు, జాకెట్ ముక్క లేదా చీర, నానబెట్టిన శనగలు ఇవ్వాలి.

ముత్తైదువులను లక్ష్మీదేవి స్వరూపంగా భావించి గౌరవించాలి.