Government Services
ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే టార్గెట్‌గా కూటమి ప్రభుత్వం.. విప్లవాత్మకమైన అడుగులు వేయడానికి రెడీ అయింది. సామాన్య ప్రజలు తమ డైలీ అవసరాల కోసం, వివిధ ధృవీకరణ పత్రాల కోసం అలాగే ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే శ్రమను తగ్గించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరికొత్త డిజిటల్ విధానాలకు శ్రీకారం చుట్టారు.
దీనిలో భాగంగా ఏపీలోని అన్ని ప్రభుత్వ శాఖలు అందిస్తున్న సర్వీసుల(Government Services)ను ఈ ఏడాది డిసెంబర్‌కి పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన , అవినీతి రహిత సర్వీసులను అందించడమే ఈ భారీ డిజిటలైజేషన్ ప్రక్రియ యొక్క మెయిన్ టార్గెట్. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుగా ఉండే కూటమి ప్రభుత్వం, ఇప్పుడు మిత్ర వాట్సప్ గవర్నెన్స్ ప్లాట్‌ఫామ్‌ను మరింత బలోపేతం చేయబోతోంది.
ప్రస్తుతం ఈ వాట్సప్ గవర్నెన్స్ వేదిక ద్వారా దాదాపు 1,035 రకాల ప్రభుత్వ సర్వీసులు(Government Services) ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఈ విధానం ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే ఏపీ వ్యాప్తంగా సుమారు 54 లక్షల మంది పౌరులు దీనిని వినియోగించుకున్నారు. దీని ద్వారా ఇప్పటి వరకు దాదాపు 1.78 కోట్ల సర్వీసులు విజయవంతంగా పూర్తయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి.
ప్రజలకు ఈ సేవలపై అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. ఇప్పటికే 24 లక్షల మందికి పైగా వాట్సప్ ద్వారా సేవలను ఎలా పొందాలో శిక్షణ ఇచ్చారు. టెక్నాలజీ రివల్యూషన్‌లో భాగంగా కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న డ్రోన్ సిటీ ప్రాజెక్టు పనులు కూడా చాలా వేగంగా సాగుతున్నాయి. మే నెల రెండో వారంలో 8 ప్రముఖ కంపెనీలు తమ ప్లాంట్లను ప్రారంభించడానికి రెడీగా ఉన్నాయని, జూలైకి మొదటి దశ పనులు పూర్తి కావాలని సీఎం డెడ్ లైన్ విధించారు.
శాంతి భద్రతల పరిరక్షణలో కూడా టెక్నాలజీని ఎక్కువగా వినియోగించుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ వ్యాప్తంగా ఉన్న సీసీ టీవీ కెమెరాల నెట్‌వర్క్‌ను విస్తృతం చేయడంతో పాటు, ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న కెమెరాల డేటాను కూడా ప్రభుత్వ ప్రధాన వ్యవస్థతో కనెక్టివిటీ చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.
దీనివల్ల నేరస్తులను గుర్తించడం, వాహనాల దొంగతనాల అదుపు, అదృశ్యమైన వ్యక్తుల ఆచూకీ కనుగొనడం ఈజీ అవుతుంది. అలాగే అంతరిక్ష టెక్నాలజీని కూడా పరిపాలనలో భాగం చేస్తూ శాటిలైట్ సమాచారాన్ని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీకి అనుసంధానించ బోతున్నారు.
దీనివల్ల అడవుల్లో మంటలు వ్యాపించినప్పుడు, ఇతర ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంధన సరఫరా వంటి ఎమర్జెన్సీ సర్వీసుల్లో ఎటువంటి అంతరాయం కలగకుండా.. ముందుగానే రెస్పాండ్ అయ్యేలా రియల్ టైమ్ నిఘా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కదులుతోంది.
Chitra Pournami : అరుణాచల క్షేత్రంలో చిత్ర పౌర్ణమి వేడుకలు..గిరిప్రదక్షిణకు ముహూర్తం ఖరారు
