AP Cabinet : 80కి పైగా అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్..రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంపు

AP Cabinet : ఐటీ, ఇండస్ట్రియల్, టూరిజం, మౌలిక సదుపాయాల కల్పన , పునరుత్పాదక ఇంధన రంగాలకు పెద్దపీట వేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అటు నిరుద్యోగుల్లో సరికొత్త ఆశలు రేకెత్తిస్తుండగా, ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద ఊరటనిచ్చాయి.

AP Cabinet

ఏపీ సమగ్ర అభివృద్ధికి, ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్‌కి ఊతమిచ్చేలా కూటమి ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగులు వేసింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఊహించని రీతిలో కొన్ని సంచలన నిర్ణయాలను తీసుకున్నారు.

మొత్తం 80కి పైగా అజెండా అంశాలపై దీర్ఘంగా చర్చించిన ఏపీ కేబినెట్(AP Cabinet), ఏపీలో పెట్టుబడుల వెల్లువ సృష్టించడమే టార్గెట్‌గా భారీ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐటీ, ఇండస్ట్రియల్, టూరిజం, మౌలిక సదుపాయాల కల్పన , పునరుత్పాదక ఇంధన రంగాలకు పెద్దపీట వేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు అటు నిరుద్యోగుల్లో సరికొత్త ఆశలు రేకెత్తిస్తుండగా, ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పెద్ద ఊరటనిచ్చాయి.

ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సిఫార్సు చేసిన సుమారు 34,000 కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ అఫీషియల్‌గా ఆమోదముద్ర వేసింది. దీని ద్వారా ఏపీవ్యాప్తంగా కొత్తగా 35,000 ఉద్యోగాల కల్పన జరగనుంది.

దీంతో పాటు రాజధాని అమరావతి డెవలప్‌మెంట్‌ను మరింత స్పీడప్ చేసేలా కీలక కేటాయింపులను జరిపారు. అమరావతి పరిధిలోని ఉండవల్లిలో రూ. 426 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు, అలాగే రూ. 139 కోట్ల వ్యయంతో ఏపీ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణానికి ఆమోదం తెలిపారు.

ల్యాండ్ పూలింగ్ స్కీమ్ పర్యవేక్షణ కోసం సీఆర్డీఏ (CRDA) లో 95 టెంపరరీ పోస్టుల మంజూరుకు అంగీకరించారు. అమరావతిని గ్లోబల్ సిటీగా మార్చే విధంగా అక్కడ అంతర్జాతీయ స్థాయి ఫైవ్‌స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు స్పెషల్ ప్రోత్సాహకాలను కూడా ప్రకటించారు.

ఇక గవర్నమెంట్ సెక్టార్లు, కార్పొరేషన్లు, సొసైటీలలో పనిచేసే ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులకు మరో రెండేళ్ల పాటు సర్వీసులో కొనసాగే ఛాన్స్ వచ్చింది.

వీటితో పాటు టూరిజం రంగానికి భారీ బూస్ట్ ఇచ్చేలా విశాఖ, తిరుపతి, కర్నూలు, అన్నవరం వంటి ఫేమస్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటునకు మంత్రివర్గం తమ అంగీకారాన్ని తెలిపింది.

AP Cabinet

పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ ఇంధనమే టార్గెట్‌గా అనంతపురం, కడప జిల్లాల్లో సోలార్, విండ్ విద్యుత్ ప్రాజెక్టులకు భూముల కేటాయింపులను జరపడంతో పాటు, ఏపీ వ్యాప్తంగా బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు విస్తృత ప్రోత్సాహకాలు ఇవ్వాలని మంత్రివర్గం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఏది ఏమయినా ఇండస్ట్రియల్ పరంగా, ఆర్థికంగా ఏపీని ముందంజలో ఉంచడానికి ఆంధ్రప్రదేశ్ కేబినెట్(AP Cabinet) తీసుకున్న ఈ 80కి పైగా నిర్ణయాలు రాబోయే రోజుల్లో ఏపీలో విప్లవాత్మక మార్పులకు వేదిక కానుండటం ఖాయం.

Numerology : మీ డేట్ ఆఫ్ బర్త్ 4, 13, 22, 31 నా? అయితే మీ మైండ్ సెట్ చాలా డిఫరెంట్ ..ఎందుకంటే?

Exit mobile version