Numerology : మీ డేట్ ఆఫ్ బర్త్ 4, 13, 22, 31 నా? అయితే మీ మైండ్ సెట్ చాలా డిఫరెంట్ ..ఎందుకంటే?
Numerology : న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 4 ఉన్నవారికి 1, 5, 6, 7 నెంబర్లు చాలా బాగా కలిసి వస్తాయి. అలాగే శనివారం, ఆదివారం , సోమవారాలు వీళ్లకు అదృష్ట దినాలుగా చెప్పొచ్చు
Numerology
న్యూమరాలజీ(Numerology) అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి నెంబర్‌కు ఒక ప్రత్యేకమైన శక్తి, స్వభావం ఉంటాయి. ఏదైనా నెలలో 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య అంటే డ్రైవర్ నెంబర్ లేదా రూట్ నెంబర్ ‘4’ అవుతుంది . జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ నెంబర్ 4 కి అధిపతి రాహువు.
రాహువు అంటేనే ఒక విభిన్నమైన ఆలోచనా విధానం, అనూహ్యమైన మార్పులకు సంకేతం. అందుకే ఈ నెంబర్‌లో పుట్టిన వ్యక్తులు మిగతా వారితో పోలిస్తే చాలా డిఫరెంట్‌గా, ఇంట్రస్టింగ్‌గా ఉంటారు. న్యూమరాలజీ ప్రకారం మూల సంఖ్య 4 ఉన్న వారి మనస్తత్వం, కెరీర్, లవ్ లైఫ్ , కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం .
సంఖ్యాశాస్త్రం(Numerology) ప్రకారం నెంబర్ 4 వ్యక్తులు సొసైటీలో ఒక కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తారు. వీళ్లు ఎప్పుడూ పాత పద్ధతులను, మూస ధోరణులను ఇష్టపడరు. అందరూ ఒక దారిలో వెళ్తే, వీళ్లు మాత్రం తమకంటూ ఒక సరికొత్త దారిని నిర్మించుకుంటారు.
సమాజంలో ఉన్న తప్పులను కానీ, అన్యాయాలను కానీ ప్రశ్నించే తత్వం వీళ్లలో ఎక్కువగా ఉంటుంది. అందుకే వీళ్లను చాలామంది రెబెల్స్ లేదా విప్లవాత్మక ఆలోచనలు ఉన్నవారిగా చూస్తారు. ఎలాంటి కష్టమైన పనినైనా పట్టుదలతో, పక్కా ప్లానింగ్‌తో పూర్తి చేయగల మొండి ధైర్యం వీళ్ల సొంతం. వీళ్లు నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతదూరమైనా వెళ్తారు.
ఇక కెరీర్ , ఆర్థిక విషయాల విషయానికి వస్తే, నెంబర్ 4 వ్యక్తులు అద్భుతమైన మేనేజర్లు, ఆర్గనైజర్లుగా రాణిస్తారు. ఐటీ రంగం, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, రీసెర్చ్, జర్నలిజం, పాలిటిక్స్, లీగల్ సిస్టమ్స్‌లో వీళ్లు చాలా త్వరగా సక్సెస్ అవుతారు.
టెక్నాలజీని వాడటంలో వీళ్లకు వీళ్లే సాటి. అయితే, ఆర్థికంగా వీళ్ల జీవితంలో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. ఒక్కోసారి ఊహించని విధంగా భారీగా డబ్బు సంపాదిస్తారు, మరోసారి అంతే వేగంగా ఖర్చులు కూడా అయిపోతుంటాయి. వీళ్లు కష్టపడి సంపాదించిన దాన్ని సరైన పద్ధతిలో ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోవాలి.
ప్రేమ, స్నేహం, బంధాల విషయానికి వస్తే, నెంబర్ 4 వ్యక్తులు అందరితో అంత త్వరగా కలిసిపోలేరు. అంతే కాకుండా వీరికున్న మొహమాటం వల్ల ఒక్కోసారి వీరే ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే వీళ్ల ఆలోచనలు విభిన్నంగా ఉండటం వల్ల చాలామంది వీళ్లను తప్పుగా అర్థం చేసుకుంటారు.
కానీ, ఒక్కసారి ఎవరికైనా కనెక్ట్ అయితే మాత్రం ప్రాణమిచ్చే స్నేహితులుగా, నమ్మకమైన భాగస్వాములుగా నిలుస్తారు. వీళ్ల దాంపత్య జీవితం బాగుంటుంది కానీ, అప్పుడప్పుడు వచ్చే పట్టుదలలు, అహంకారం వల్ల చిన్నపాటి మనస్పర్థలు రావొచ్చు. ఎదుటివారి అభిప్రాయాలను కూడా గౌరవించడం అలవాటు చేసుకుంటే వీళ్ల రిలేషన్స్ మరింత స్ట్రాంగ్‌గా మారుతాయి.

అయితే, రాహువు ప్రభావం వల్ల నెంబర్ 4 వ్యక్తులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వీళ్లకు కోపం చాలా తొందరగా వస్తుంది, అలాగే మాట కూడా కాస్త ముక్కుసూటిగా ఉంటుంది. దీనివల్ల తెలియకుండానే సమాజంలో శత్రువులను పెంచుకుంటారు. కొన్నిసార్లు లేనిపోని విషయాల గురించి ఆలోచిస్తూ మానసిక ఒత్తిడికి, డిప్రెషన్‌కు లోనవుతారు. వీటికి దూరంగా ఉండాలంటే వీళ్లు ప్రతిరోజూ కాసేపు మెడిటేషన్ చేయడం, వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోవాలి.
న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 4 ఉన్నవారికి 1, 5, 6, 7 నెంబర్లు చాలా బాగా కలిసి వస్తాయి. అలాగే శనివారం, ఆదివారం , సోమవారాలు వీళ్లకు అదృష్ట దినాలుగా చెప్పొచ్చు. బ్లూ, గ్రే, గ్రీన్, వైట్ కలర్స్ వీరికి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. మంగళవారం , శనివారం రోజుల్లో దుర్గాదేవిని గానీ, గణపతిని గానీ ఆరాధించడం వల్ల వీరికి ఉన్న మానసిక ఇబ్బందులు తొలగిపోయి, అద్భుతమైన విజయాలు సొంతమవుతాయి
Numerology : నెంబర్ 3 వారి మైండ్ సెట్..వీరితో పెట్టుకుంటే అంతే సంగతులు!





