Cyclone Alert : ముంచుకొస్తున్న ముప్పు..బాపట్ల-విశాఖ మధ్య తీరాన్ని తాకనున్న అతి తీవ్ర తుపాను

Cyclone Alert : బంగాళాఖాతంలో మెల్లగా బలపడుతున్న వాయుగుండం అతి తీవ్ర తుపానుగా మారి అక్టోబర్ 28 వతేదీన ఏపీ తీరం దాటే అవకాశం ఉంది.దీంతో బాపట్ల-విశాఖ మధ్య పెను ప్రభావం చూపించబోతోంది. ఈ తుపాను హెచ్చరికల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Cyclone Alert

సముద్రం లోపల ఏదో జరుగుతోంది అన్నట్లుగా వాతావరణంలో కనిపిస్తున్న  మార్పులు కోస్తాంధ్ర వాసులలో గుబులు రేపుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన  అల్పపీడనం మెల్లగా రాక్షస రూపాన్ని దాలుస్తూ తెలుగు రాష్ట్రాల వైపు వేగంగా పరుగులు పెడుతోంది. కేవలం గంటల వ్యవధిలోనే ఇది మరింతగా బలపడి, ఏపీ మీదుగా బీభత్సం సృష్టించడానికి రెడీ అవుతోంది.
వచ్చే కొద్ది రోజుల్లో ఇది  అతి తీవ్ర తుపానుగా(Cyclone Alert) మారనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటంతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. కొద్ది రోజుల క్రితం ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం  మెల్లగా బలపడి వాయుగుండంగా రూపాంతరం చెందింది.
ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి ఆగ్నేయంగా 820 కిలోమీటర్లు, కాకినాడకు 910 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై కదులుతోంది. మొదట దక్షిణ దిశగా సాగిన ఈ వాయుగుండం, అక్టోబర్ 25వ తేదీకి మరింతగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుంది. ఆ తర్వాత తన దిశ మార్చుకుని పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ అసాధారణ పవర్‌ను సంతరించుకోనుంది.
వాతావరణ నిపుణులు చెబుతున్నదాని ప్రకారం ఈ గాలివాన ఒక్కో మెట్టు ఎక్కుతూ తీవ్రరూపం దాల్చబోతోంది. అక్టోబర్ 26 వ తేదీకి తుపానుగా, 27వ తేదీకి  తీవ్రమైన తుపానుగా రూపాంతరం చెంది, చివరకు అక్టోబర్ 28కి ఉదయంకి అతి తీవ్ర తుపాను స్థాయికి చేరుకుంటుంది.
సరిగ్గా అదే రోజు ఉదయం 11:30 గంటల ప్రాంతంలో బాపట్ల- విశాఖపట్నం మధ్య ప్రాంతంలో ఇది తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఆ సమయంలో  గంటకు 115 – 125 కి.మీటర్ల వేగంతో  గాలులు వీచే అవకాశం ఉంది. ఒకవేళ తీవ్రత మరింత పెరిగితే ఈ వేగం గరిష్ఠంగా 140 కి.మీటర్ల వరకు ఎగిసిపడే భయంకర పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు.
Cyclone Alert
ప్రస్తుతం సముద్రంలో ఉన్న వాతావరణ పరిస్థితులు.. సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు 29 -30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండటం, దీనికి తోడు మాడెన్-జూలియన్ ఆసిలేషన్ (MJO) వంటివి ఈ తుపాను తీవ్రతను మరింత పెంచడానికి ఆజ్యం పోస్తున్నాయి.

ఈ తుపాను(Cyclone Alert) ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్, యానాం తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉండనుంది. వాతావరణ శాఖ ఇప్పటికే ఇక్కడ ప్రీ-సైక్లోన్ పరిస్థితిని జారీ చేసింది. కాగా ఈ తుపాను తీరం దాటిన తర్వాత కానీ ఆ సమయంలో వీచే ఈదురుగాలుల ప్రభావం వల్ల  కానీ తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట వంటి సరిహద్దు జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Secrets : నమ్మి సీక్రెట్ చెబితే ఊరంతా ఊదేస్తున్నారా? ఈ బిహేవియర్ వెనుక సైకాలజీ ఏంటి..

↑
Exit mobile version