DA Hike
ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లు ఎంతో కాలం నుంచి ఆశగా ఎదురుచూస్తున్న ఆ శుభ తరుణం వచ్చేసింది. నెలల తరబడి శాలరీల పెంపు, బకాయిల కోసం ఊరిస్తున్న డీఏల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వీరందరికీ ఊహించని ధమాకా ఆఫర్ ఇచ్చేసింది.
ప్రభుత్వ ఉద్యోగ వర్గాలందరి ముఖాల్లో నవ్వులు పూయిస్తూ ఆర్థిక శాఖ ఒకేసారి రెండు కరువు భత్యం (DA) వాయిదాలను మంజూరు చేస్తూ అఫీషియల్‌గా జీవో జారీ చేసింది. వైఎస్సాసీపీ ప్రభుత్వ హయాం నుంచి వరుసగా డీఏలన్నీ పెండింగ్‌లో పడిపోతూ వచ్చాయి.
కూటమి ప్రభుత్వం పవర్‌లోకి వచ్చాక, ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విన్నపాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు.. వీటిని క్లియర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ ఈ ఆర్డర్స్‌ను రిలీజ్ చేశారు. రెండు విడతలను లెక్కలు వేసుకుని ఈ పెరిగిన డీఏలను అమలు చేయబోతున్నారు.
దీనిలో మొదటిది, 2024 జులై 1 నుంచి అమల్లోకి వచ్చేలా 2.73 శాతం డీఏను యాడ్ చేయగా..మరోకటి 2025 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా మరో 1.82 శాతం డీఏను ఆమోదించారు. అంటే ఓవరాల్‌గా 4.55 శాతం డీఏ ఉద్యోగులు, పెన్షనర్ల అకౌంట్స్‌లో యాడ్ అవ్వనుంది.
ఈ పెంపు వల్ల ప్రతీ ఉద్యోగి, పెన్షనర్‌కు కూడా వారి బేసిక్ పే ఆధారంగా మంత్లీ వచ్చే శాలరీలోనూ హైక్ బాగానే ఉంటుంది. సాధారణ ఉద్యోగులకు నెలకు సుమారు రూ. 1,500 నుంచి రూ. 3,500 వరకు పెరగనుండగా.. ఇక హయ్యర్ కేడర్ సీనియర్ ఉద్యోగులకు ఏకంగా రూ. 5,000 నుంచి రూ. 8,000 వరకూ జీతం జంప్ కానుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న దాదాపు 16 లక్షల మంది కుటుంబాలకు ఇది డైరెక్ట్‌గా లాభం చేకూరుస్తుంది. వీరిలో దాదాపు 6 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు, టీచర్లు ఉండగా.. మరో 4 లక్షల మందికి పైగా రిటైర్డ్ పెన్షనర్లు అలాగే ఫ్యామిలీ పెన్షనర్లు ఉన్నారు. వీరితో పాటు కాంట్రాక్ట్, పార్ట్ టైమ్ సిబ్బందికి కూడా ఈ బెనిఫిట్స్ అందుతాయి.
ఈ నిర్ణయంతో కూటమి ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ. 2,880 కోట్లకు పైగా అదనపు భారం పడుతుంది. అరియర్స్ బకాయిలను కూడా ఇలా పక్కా షెడ్యూల్‌తో క్లియర్ చేయనుందన్న వార్త పండుగ ముందే ఏపీ ఉద్యోగులలో ఉత్సాహాన్ని నింపింది.
