Age For Marriage : పెళ్లికి ఏజ్ ఒక్కటే సరిపోదా?..మ్యారీడ్ లైఫ్‌ను లీడ్ చేసే మెచ్యూరిటీ ఉండాలా?

Age For Marriage : మ్యారేజ్ లైఫ్‌లో బయోలాజికల్ ఏజ్ కంటే ..ఎమోషనల్ ఏజ్ అంటే ఎమోషనల్ మెచ్యూరిటీ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందన్న విషయాన్ని అంతా అర్థం చేసుకోవాలి.

Age For Marriage

మన సొసైటీలో పెళ్లి అనగానే ఎమోషనల్‌గా రెడీ అవడం కంటే ఏజ్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ఒక వ్యక్తికి 25 ఏళ్లు దాటగానే మ్యారేజ్ ప్రపోజల్స్ మొదలవుతాయి. 28 ఏళ్లు వచ్చేసరికి మెంటల్‌గా రెడీ ఉన్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా మ్యారేజ్ చేయడం ప్రైమరీ మేటర్‌గా మారిపోతుంది.

కానీ మ్యారేజ్ లైఫ్‌లో బయోలాజికల్ ఏజ్ కంటే ..ఎమోషనల్ ఏజ్ అంటే ఎమోషనల్ మెచ్యూరిటీ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందన్న విషయాన్ని అర్థం చేసుకోరు. పార్ట్‌నర్స్ ఇద్దరూ ఎలా కమ్యూనికేట్ చేస్తారు, తమ మధ్య డిఫరెన్సెస్‌ను ఎలా పరిష్కరించుకుంటారు, జీవితంలో వచ్చే కష్టనష్టాలను ఎలా ఫేస్ చేస్తారనేది ఈ మెచ్యూరిటీ లెవల్‌ పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే పెళ్లికి ముందే జంటలు కొన్ని విషయాలు చర్చించుకోవాలని మానసిక నిపుణులు చెబుతున్నారు.

30 లేదా 40 ఏళ్లు వచ్చినంత మాత్రాన ఒక వ్యక్తి ఎమోషనల్‌గా మెచ్యూర్ అయినట్లు కూడా కాదు. ఈ మెచ్యూరిటీ అనేది సెల్ఫ్ అవేర్‌నెస్, అనుభవం, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడంతో పాటు మిస్టేక్స్ నుంచి నేర్చుకునే మైండ్ సెట్ నుంచి వస్తుంది. అందుకే ఒకే ఏజ్ ఉన్న ఇద్దరు వ్యక్తులు రిలేషన్‌లో డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంటారు. ముఖ్యంగా జంటల మధ్య అభిప్రాయ భేదాలు, గొడవలు, సమస్యలు వచ్చినప్పుడే ఈ ఎమోషనల్ మెచ్యూరిటీ అసలైన పరీక్షను ఎదుర్కొంటుందని చెప్పొచ్చు.

సాధారణంగా పెళ్లి చూపులు లేదంటే డేటింగ్ సమయంలో మాట్లాడే విషయాలన్నీ కూడా కెరీర్, ఫ్యామిలీ, ఇష్టాఇష్టాలు, ఫ్యూచర్ ప్లాన్స్ చుట్టూనే తిరుగుతుంటాయి. కానీ నిరాశ, ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్, కోపం లేదా మానసిక ఒత్తిడి వచ్చినప్పుడు పార్ట్‌నర్ ఎలా రియాక్టవుతారో వెంటనే తెలుసుకోవడం కష్టం.

ఒక పర్సన్‌కు పెళ్లికి తగిన ఎమోషనల్ మెచ్యూరిటీ ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. వారి ఇంట్లో గొడవలు జరిగినప్పుడు, తనను రిజెక్ట్ చేసినట్లు ఫీలవకుండా ఉంటారా? ఒకవేళ తన వల్ల పొరపాటు జరిగితే వెంటనే డిఫెన్సివ్‌గా మారకుండా సారీ చెబుతారా? తన అవసరాలు ఏంటనేవి చెప్పకుండా ఇంట్లో వాళ్లే అర్ధం చేసుకుని తీర్చాలని అనుకుంటారా? అలాగే ఏదైనా ప్రాబ్లెమ్ వచ్చినప్పుడు తనంతట తాను సద్దుకుపోతున్నారా లేదా ఎప్పుడూ ఇంట్లో వాళ్లు ఓదార్చాలని ఆధారపడుతున్నారా అనేది ముందుగా తమకు తాము ప్రశ్నించాలి.

ఎందుకంటే జంటల మధ్య ఎమోషనల్ మెచ్యూరిటీలో ఎక్కువ గ్యాప్ ఉన్నప్పుడు, ఒకరు మాత్రమే ఆ రిలేషన్‌లో ప్రతీసారి పెద్ద దిక్కుగా మారాల్సిన పరిస్థితి వస్తుంది. బాధ్యతలను తీసుకోవడం, గొడవలు సద్దుమణిగేలా చేయడం, కీలక నిర్ణయాలను తీసుకోవడం, చివరికి పార్ట్‌నర్స్ మధ్య జరిగే ఎమోషనల్ ఫీలింగ్స్‌ను కంట్రోల్ చేయడం కూడా ఒకరిపైనే పడుతుంది. ఇది రానురాను భార్యాభర్తల రిలేషన్ కంటే పేరెంట్స్-పిల్లల సంబంధంలా మిగిలిపోతుంది.

Age For Marriage

ఎమోషనల్ మెచ్యూరిటీ అంటే ఎప్పుడూ శాంతంగా ఉండటం లేదంటే అసలు కోపం రాకపోవడం కాదు. ఒక వ్యక్తికి కోపం, జెలస్, బాధ రావడం కామన్. కానీ ఆ ఎమోషనల్ ఫీలింగ్స్‌ను వారెలా వ్యక్తం చేస్తున్నారు, తప్పును పార్ట్‌నర్‌పై తోసేయకుండా తమ బిహేవియర్‌ను గుర్తించగలుగుతున్నారా లేదా అనేదే ఇంపార్టెంట్.

అందుకే మ్యారేజ్‌కు ముందు కేవలం పేపర్స్‌పై ఉండే వివరాల కంటే ఇద్దరి మధ్య గొడవలు వస్తే దానిని ఎలా డీల్ చేస్తారు? కోపం వస్తే ఎలా బిహేవ్ చేస్తారు? ఇంటి బాధ్యతలను అంటే ఫైనాన్సిషల్ రెస్పాన్సిబిలిటి అండ్ ఇంటికి సంబంధించిన పనులను ఎలా పంచుకుంటారనే విషయాలపై ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోవాలి. పెళ్లి ఏజ్ రావడం వేరు, ఒక ఆరోగ్యకరమైన, ఒక రిలేషన్‌ను జీవితాంతం నిలబెట్టుకునే ఎమోషనల్ మెచ్యూరిటీ ఉండటం వేరని గుర్తించడం చాలా అవసరం.

1980s Photo Craze : రెట్రో లుక్ కోసం APK లింక్స్ క్లిక్ చేస్తున్నారా? 1980s ఫోటో క్రేజ్‌తో సైబర్ దొంగలు వచ్చేశారు జాగ్రత్త..

Exit mobile version