AP Municiapl Elections
ఏపీలో స్థానిక పురపాలక పోరు తుది ఘట్టానికి చేరిన సమయంలో.. సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన ఆదేశాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతున్నాయి. ప్రతిపక్ష కేండిడేట్స్ను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారనే ఫిర్యాదుపై స్పందించిన సుప్రీంకోర్టు, పోటీ చేయాలనుకునే అర్హులైన ప్రతీ అభ్యర్థికి పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసు యంత్రాంగంపై ఉందంటూ ఏపీ డీజీపీకి స్పష్టమైన గైడ్లైన్స్ జారీ చేసింది.
మరోవైపు ఏ ఎన్నికలు అయినా ప్రజాస్వామ్య బద్ధంగా, పారదర్శకంగా జరగడమే ప్రాథమిక సూత్రమని తేల్చి చెప్పిన ధర్మాసనం .. ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ ప్రకారం విడుదల చేయాల్సిన కేండిడేట్స్ ఫైనల్ లిస్ట్ ప్రచురణను అక్టోబర్ 25వ తేదీ వరకు వెంటనే వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను (SEC) ఆదేశించింది.
అంతేకాదు ఈ కేసులో వివిధ రాజకీయ పక్షాలు, అభ్యర్థులు సమర్పించిన వినతి పత్రాలను, ఆధారాలను, వీడియో క్లిప్పింగులను, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను మరింత లోతుగా పరిశీలించమని ఎస్ఈసీకి ఆర్డర్ వేసింది.
శాంతిభద్రతలలో లోపాలేమైనా నమోదు అయినా లేదంటే నామినేషన్లు వేయకుండా ఎవరైనా అడ్డుకున్నట్లు ఆధారాలు ఉంటే..ఆ నామినేషన్ల గడువును పెంచాలా వద్దా అనే అంశంపై అక్టోబర్ 22వ తేదీ నాటికి ఏపీ ఎన్నికల సంఘం సమగ్ర నిర్ణయాన్ని తీసుకోవాలని ఆదేశించింది.
ఇటు పోటీకి సిద్ధపడే ప్రతి ఒక్క అభ్యర్థికి సమానమైన, స్వేచ్ఛాయుతమైన అవకాశాలు దక్కాలన్నదే తమ ఉద్దేశమని చెప్పిన న్యాయస్థానం.. దీనిపై పోలీసు శాఖ తీసుకున్న భద్రతా చర్యలతో పాటు ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాలపై వెంటనే వివరణాత్మక నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 26వ తేదీకి వాయిదా వేసింది. నామినేషన్ల గడువు పెంపు అలాగే ఫైనల్ లిస్ట్ వాయిదా పడటంతో, ఏపీలో ఏకగ్రీవమైనట్లు ప్రచారం జరిగిన కొన్ని స్థానాల(AP Municiapl Elections) సమీకరణాలు మళ్లీ మొదటికి వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Ravana Tandavam : రామాయణ నుంచి రావణ తాండవం గ్లింప్స్.. ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్స్ క్రేజీ కాంబో..
