Arnab Cyclone Red Alert
దేశ తూర్పుతీరాన్ని వణికిస్తున్న అర్నబ్ అతి తీవ్ర తుపాను ఏపీ తీరం వైపు అత్యంత వేగంగా దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఈ ఇయర్ ఫస్ట్ తుపానుగా సోమవారం ఏర్పడిన ఈ తుపాన్‌కు బంగ్లాదేశ్ ప్రభుత్వం సూచించిన అర్నబ్ అనే పేరు పెట్టారు. ప్రస్తుతం ఇది బలపడి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదులుతుండటంతో ఉత్తర కోస్తాపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అక్టోబర్ 27 మంగళవారం ,అక్టోబర్ 28 బుధవారం సముద్రం అత్యంత అల్లకల్లోలంగా మారనుండగా, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాల నుంచి కుంభృష్టి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 115 – 150 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే ఛాన్స్ ఉండటంతో కోస్తాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
ఈ తుపాను(Arnab Cyclone Red Alert) యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని, ఒకవేళ వాతావరణంలో వచ్చే చేంజెస్ వల్ల దిశ మారితే మాత్రం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరం దాటే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం వరకు ఈ తుపాను తీవ్రత తీవ్రంగా ఉంటుందని, ఆ తర్వాత క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.
పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం పూర్తిగా అలర్ట్ అయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సహాయక చర్యల కోసం ఏపీలోని 20 జిల్లాల కలెక్టర్లకు రూ.27 కోట్లు రిలీజ్ చేసినట్లు తెలిపారు. అలాగే భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో స్కూల్స్‌కు సెలవులు ప్రకటించడంతో పాటు రేషన్ దుకాణాల్లో నిత్యావసరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పారు.
అర్నబ్ తుపాను(Arnab Cyclone Red Alert) ఉధృతి వల్ల దక్షిణ మధ్య రైల్వే , దక్షిణ కోస్తా రైల్వే యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యాయి. తుపాను కారణంగా రైలు పట్టాలు, వంతెనలు దెబ్బతినకుండా ఉండటానికి ముందస్తు చర్యలను చేపట్టాయి. విశాఖపట్నం నుంచి రాకపోకలు సాగించే సుమారు 53 రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. విశాఖ – కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు కొన్ని పాసింజర్, ఇంటర్‌సిటీ రైళ్లు నిలిపివేయబడ్డాయి.
తుపాను సమయంలో ప్రయాణాల్లో తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున, ప్రయాణికులెవరూ చివరి నిమిషంలో స్టేషన్‌కు వచ్చి ఇబ్బంది పడొద్దని రైల్వే శాఖ సూచించింది. ముందుగానే తమ ట్రైన్ స్టేటస్‌ను చెక్ చేసుకుని ప్లాన్ సిద్ధం చేసుకోవాలని చెప్పింది.
