Monday Nominations : బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్ల రచ్చ.. గోట్స్ చేతిలో పవర్, రగిలిపోయిన హౌస్..

Monday Nominations : బిగ్ బాస్ హౌస్‌లో అల్టిమేట్ గోట్ టాస్క్‌తో ఈ వీక్ నామినేషన్ల పర్వం మొదలయిపోయింది. అయింది. ముకేశ్, రామకృష్ణ గొడవలు, త్రిగుణ్ సంచలన నామినేషన్లతో హౌస్ హీటెక్కింది.

Monday Nominations

బిగ్ బాస్ హౌస్‌లో సండే రోజు జరిగిన డబుల్ ఎలిమినేషన్స్ ఎమోషన్స్ ఇంకా చల్లారకముందే, సోమవారం నామినేషన్ల(Monday Nominations) హీట్ మొదలైపోయింది. రాత్రి ఫుడ్ విషయంలో ముకేశ్, దేబ్జానీ మధ్య స్టార్ట్ అయిన చిన్న గొడవ కాస్తా చివరికి శివ్‌తో ముకేశ్ వాగ్వాదానికి దారితీసింది. ఆ తర్వాత వాష్‌రూమ్‌లో ర్యాక్స్ కేటాయింపు విషయంలో శివ్, రామకృష్ణ కోసం ముకేశ్‌తో గొడవ పెద్దదైంది. అసలు ముకేశ్ ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని దేబ్జానీ, శివ్, శ్వేత కలిసి చాలా సేపు డిస్కస్ చేశారు.

ఇక అసలు ట్విస్ట్‌గా అల్టిమేట్ గోట్ టాస్క్ పెట్టారు బిగ్ బాస్. ఎల్లో, రెడ్ జోన్‌లలో ఉన్నవాళ్ల ఫ్యూచర్‌ను గ్రీన్ జోన్‌లో ఉన్న గోట్స్ అంటే త్రిగుణ్, అమన్, దేబ్జానీ, నీతూ, ముకేశ్ డిసైడ్ చేస్తారని ప్రకటించారు. గ్రీన్ జోన్ వాళ్లకు రెండు వీక్స్ ఇమ్యూనిటీ ఉండటంతో, ఒక్కొక్కరు ముగ్గురి ఇంటి సభ్యులను నామినేట్ చేసే పవర్ దక్కింది.

మొదట నీతూ .. ఝాన్సీని నామినేట్ చేయగా, త్రిగుణ్ తన మొదటి ఛాయిస్‌గా కెప్టెన్సీ ఫెయిల్ అయ్యాడనే కారణంతో రామ్ ప్రసాద్‌ను ఎంచుకున్నాడు. ఈ మొదటి రౌండ్ ఎవరితోనూ పెద్దగా గొడవలు లేకుండా నార్మల్‌గానే ముగిసింది. కానీ ఆ తర్వాతే అసలు రగడ మొదలైంది. ముకేశ్ ..రామకృష్ణను నామినేట్ చేయడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదిరి తారాస్థాయికి చేరింది. ఈ గొడవలో కోపంతో ఊగిపోయిన ముకేశ్, రామకృష్ణను మూర్ఖుడు అనడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

ఇక త్రిగుణ్ తన రెండో నామినేషన్‌గా రోహిత్ పేరును చెప్పాడు. రోహిత్ వ్యవహారశైలి బాగోలేదని త్రిగుణ్ చెబుతుండగా.. రోహిత్ దాన్ని లైట్ తీసుకుంటూ ఎగతాళిగా నవ్వాడు. హౌస్‌లో ఎంతమంది చెప్పినా, స్వయంగా హోస్ట్ నాగార్జున కూడా ఎన్నిసార్లు తిట్టి పనిష్మెంట్లు ఇచ్చినా రోహిత్‌లో ఛేంజ్ రాలేదని అందరూ విమర్శించారు. షాలిని వెళ్లిపోయిన బాధలో ఉన్నానని రోహిత్ చెప్పినా, అతని బిహేవర్‌ను చూస్తుంటే ఈ వారం కూడా నాగ్ చేతిలో రోహిత్‌కు గట్టిగానే తగలనుందని అంతా ఫిక్స్ అయిపోయారు..

ఆ తర్వాత దేబ్జానీ.. ఝాన్సీని నామినేట్ చేయగా, నువ్వు నాకు క్లోజ్ కాదంటూ చెప్పడంతో ఝాన్సీ హర్ట్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంది. మేకప్ విషయంలో చిన్న హెల్ప్‌ కోసం వస్తే దాన్ని కూడా దేబ్జానీ నెగిటివ్‌ చేసి మాట్లాడిందని బాధపడింది… ఇక అమన్ సుధీర్‌ను నామినేట్ చేయగా, ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరగడంతో.. అమన్ మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Monday Nominations

ఇక ఈ నామినేషన్లలో బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే.. త్రిగుణ్ తన స్నేహితురాలైన వర్షినిని నామినేట్ చేశాడు. గతంలో జరిగిన టాస్క్‌లో ఫ్రెండ్ అయినా కూడా తనకు సపోర్ట్ చేయకుండా త్రిగుణ్ ఒంటరిగా ఆడి గెలిచాడని, ఆ మెంటాలిటీ నచ్చలేదని వర్షిని బాధపడింది. ఫ్రెండ్సిప్‌కు విలువ ఇవ్వలేదంటూ ఆమె కన్నీరు పెట్టుకోవడంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగినట్లు కనిపిస్తోంది. మొత్తానికి మొదటి రోజు నామినేషన్లు(Monday Nominations) పెద్ద ఫైట్లు, గొడవలు,ఎమోషన్స్ పీక్స్‌లో లేకపోయినా, ఊహించని ట్విస్టులు, ఓ మోస్తరు ఎమోషన్లతో రంజుగానే సాగాయి.

Liver : లివర్ డ్యామేజ్ అయ్యే ముందు బాడీ ఇచ్చే సైలెంట్ వార్నింగ్స్ .. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..

↑
Exit mobile version