Bank Jobs
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగ యువతకు మంచి ఛాన్స్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో ఉన్న ఖాళీల భర్తీకి ..ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
మొత్తం 338 పోస్టులలో 295 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు కాగా, మిగిలిన 43 స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఎంపికైనవారికి వారి సొంత జిల్లాలోనే పోస్టింగ్ లభించడంతో పాటు, స్టార్టింగ్‌లోనే అలవెన్సులతో కలిపి నెలకు దాదాపు రూ. 47,000 వరకు శాలరీ లభించే అవకాశం ఉంది. జులై 24వ తేదీ నుంచే అఫీషియల్‌గా ఈ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రాసెస్ స్టార్ట్ అయింది.
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులెవరైనా.. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ కానీ పీజీ కానీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు ఏ జిల్లాలో పోస్టుకు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ జిల్లాకు చెందిన స్థానికులై ఉండటం అనేది దీనిలో మెయిన్ క్వాలిఫికేషన్.
వీటితో పాటు ఇంగ్లీష్, కంప్యూటర్ నాలెడ్జ్ ,లోకల్ లాంగ్వేజ్‌లో మంచి ప్రావీణ్యం ఉండాలి. వయస్సు విషయానికి వస్తే 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ , ఎస్టీలకు ఐదేళ్లు, అలాగే దివ్యాంగులకు పది నుంచి పదిహేనేళ్ల వరకు గరిష్ట వయోపరిమితిలో మినహాయింపు ఉంటుంది.
అర్హత కలిగిన కేండిడేట్లు సంబంధిత జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుము కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు , మాజీ సైనికోద్యోగులు అయితే రూ. 590 చెల్లించాలి.
ఓసీ, బీసీ , ఈడబ్ల్యూఎస్ వర్గాల అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 826గా నిర్ణయించారు. ఈ నియామకాలు ముఖ్యంగా చిత్తూరు, విశాఖపట్నం, కడప, ప్రకాశం, నెల్లూరు , విజయనగరం జిల్లాల డీసీసీబీ బ్యాంకులకు సంబంధించి జరగబోతున్నాయి.
ఈ కేండిడేట్ల ఎంపిక పూర్తిగా ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారానే జరగనుంది. ఈ ఎగ్జామ్ మొత్తం 200 మార్కులకు ఉండగా.. ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఫైనాన్స్ అవేర్‌నెస్ ,కంప్యూటర్ నాలెడ్జ్ అనే ఐదు సెక్షన్స్ ఉంటాయి.
ప్రతి సెక్షన్ నుంచి 40 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ఎగ్జామ్ పూర్తి చేయడానికి 2 గంటల సమయం కేటాయించారు. ఈ ఎగ్జామ్‌లో నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా అమలులో ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్‌కు నాలుగో వంతు అంటే 0.25 మార్కులు కోత విధిస్తారు. ఆన్‌లైన్ అప్లికేషన్లు సబ్‌మిట్ చేయడానికి ఆగస్టు 7వ తేదీ చివరి గడువు కాగా, పరీక్షను ఆగస్టులో కానీ సెప్టెంబర్ నెలలో కానీ నిర్వహించే అవకాశాలున్నాయి.
ఉదాహరణగా.. విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో(DCCB) ఉన్న పోస్టులు, అప్లికేషన్ విధానం గురించి తెలుసుకోవడానికి ఈ లింక్‌పై నొక్కండి.
