Friendship Breakup
మనం జనరల్‌గా లవ్ బ్రేకప్స్ మాత్రమే ఎక్కువగా బాధ పెడతాయని.. లైఫ్‌ని వెనక్కి లాగేసి మెంటల్‌గా చాలా పెయిన్‌ను ఇస్తాయని అనుకుంటూ ఉంటాం. సొసైటీలో కూడా లవ్ ఫెయిల్యూర్ అయినవాళ్లకు ఇచ్చే సానుభూతి, ఓదార్పు చాలా ఎక్కువగా ఉంటాయి.
అయితే బెస్ట్ ఫ్రెండ్స్ దూరమైనప్పుడు, ఆ ఫ్రెండ్షిప్ బ్రేకప్ వల్ల కలిగే బాధ కూడా అంతే ఇంటెన్స్‌గా ఉంటుంది. ప్లాటోనిక్ బ్రేకప్స్ అని పిలిచే ఈ ఫ్రెండ్షిప్ విచ్ఛిన్నాన్ని తేలికగా తీసిపారేయకుండా, అంతా గుర్తించాల్సిన అవసరం కూడా ఉందని సైకాలజిస్టులు చెబుతున్నారు.
ఒక ప్రాణ స్నేహితుడిని కోల్పోవడనేది కూడా గుండె పగిలే అనుభవంతోనే సమానం. చాలామంది జీవితంలో ఫ్రెండ్షిప్ అనేది వాళ్ల ఐడెంటిటీతో, డైలీ రొటీన్‌తో పాటు.. ఒక రకమైన సెక్యూరిటీ ఫీలింగ్‌తోనూ ముడిపడి ఉంటుంది. అందుకే ఆ రిలేషన్ తెగిపోయినప్పుడు, లవ్ బ్రేకప్ వల్ల ఎంత ఖాళీతనం అనిపిస్తుందో ఇక్కడ కూడా అదే ఎంప్టీనెస్ రిపీట్ అవుతుంది.
సుదీర్ఘమైన ఫ్రెండ్షిప్ తెగిపోవడం వల్ల మనుషులు చాలా ఎక్కువగా డిస్టర్బ్ అవుతారని సైకాలజిస్టులు చెబుతున్నారు. లవ్ బ్రేకప్ అయితే ఓదార్చే ఫ్రెండ్స్, మూవీ నైట్స్ వంటి సపోర్ట్ దొరుకుతుంది. కానీ ఫ్రెండ్షిప్ బ్రేకప్ అయినప్పుడు ఆ పెయిన్ బయటకు చెప్పడానికి కూడా జనాలు పెద్దగా ఇష్టపడరు. దీనికి పక్కా క్లోజింగ్ అంటూ లేకపోవడం సిచ్యువేషన్‌ను మరింత దారుణంగా మారుస్తుంది.
మనం మన జీవితంలోని మంచి చెడులను, ప్రైవేట్ థాట్స్, సీక్రెట్స్ అన్నీ కూడా బెస్ట్ ఫ్రెండ్స్‌తో పంచుకుంటాం. అలాంటి ఫ్రెండ్షిప్స్ హఠాత్తుగా ఆగిపోతే, మన జీవితంలో ఒక పార్ట్ కొట్టుకుపోయినట్లు అనిపిస్తుంది. లవర్స్ బ్రేకప్ లాగా ఈ బాధ బయటకు ఏడ్చేలా కనిపించకపోవచ్చు. కానీ సైలెన్స్‌గా లోలోపలే మనిషిని నలిపేస్తుంది.
దీనివల్ల కొంతమందిలో సోషల్ విత్‌డ్రావల్ అంటే నలుగురిలోకి వెళ్లకపోవడం, ఇతరులు ఎక్కడ తమను రిజెక్ట్ చేస్తారో అనే భయం, దిగులు, స్లీప్ ప్రాబ్లెమ్స్, రీజన్ లేని కోపం, పాత జ్ఞాపకాలు ఉన్న ప్లేసెస్‌ను వదిలేయడం, కాన్సంట్రేషన్ తగ్గడం వంటివి కనిపిస్తాయి. ఇవి నార్మల్ స్ట్రెస్‌లాగే ఉంటాయి. కాబట్టి, చాలామంది వీటిని తమ ఫ్రెండ్షిప్ బ్రేకప్‌తో లింక్ చేసి చూడలేరు.
స్నేహం విషయంలో ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడి పీస్ ఆఫ్ మైండ్ సాధించడం కాస్త కష్టమే. ఎందుకంటే ఇక్కడ ఏదీ ఒకే డెసిషన్‌తోనే క్లోజ్ అవ్వదు. దీని కోసం ముందు మీ పెయిన్‌ని మీరే యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. మీ ఫీలింగ్స్‌ని ఒక నోట్‌బుక్‌లో రాసుకోవడం లేదా నమ్మకమైన వారితో, థెరపిస్ట్‌తో పంచుకోవడం వల్ల మైండ్ తేలికపడుతుంది.
అన్నింటికంటే మెయిన్‌గా ఆ ఫ్రెండ్షిప్‌లో ఉన్న మంచి మెమొరీస్‌ని, దాని ఎండింగ్‌ని వేరువేరుగా చూడటం అలవాటు చేసుకోవాలి. ఆ హ్యాపీ డేస్ నిజమే, అలాగే ఆ ఎండింగ్ కూడా నిజమేనని యాక్సెప్ట్ చేసినప్పుడే జీవితంలో ముందుకు సాగడం పాజిబుల్ అవుతుంది.
AQP4 Gene : రాత్రిళ్లు నిద్ర పట్టట్లేదా?..నైట్ టైమ్‌లో బ్రెయిన్‌లో జరిగే ‘జీన్’ కథ తెలుసుకోండి..
