Enumeration : ఎన్యూమరేషన్ ఫామ్‌ సబ్‌మిట్‌కు 6 రోజులే గడువు.. ఆలస్యం చేస్తే మీ ఓటు గల్లంతే

Enumeration : గతంలో పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాలలో లక్షలాది మంది ఇలాగే నిర్లక్ష్యం వల్ల తమ తమ ఓటు హక్కు కోల్పోయారని, కాబట్టి ఏపీ ఓటర్లు ఆలస్యం చేయకుండా ఎన్యూమరేషన్ పేపర్స్‌ను ఫిల్ చేసి ఇవ్వాలని సూచిస్తున్నారు.

Enumeration

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఓటర్ల లిస్ట్ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రాసెస్ శరవేగంగా సాగుతోంది. ఓటర్ల లిస్టులో మీ పేరు కొనసాగాలంటే వెంటనే అలర్ట్ అవ్వాలని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. మీ వివరాలతో కూడిన ఎన్యూమరేషన్ పత్రాలను (EF) బూత్ స్థాయి అధికారుల (BLO)కు తిరిగి ఇవ్వడానికి కేవలం 6 రోజులు మాత్రమే సమయం ఉంది.

ఈ నెల 14వ తేదీని ఎన్యూమరేషన్ ఫామ్‌లు సబ్మిట్ చేయడానికి ఫైనల్ డేట్‌గా నిర్ణయించారు. ఒకవేళ పూర్తి చేసిన పత్రాలను ఆలోగా సబ్‌మిట్ చేయకపోతే మీ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.

ఈ నెల 21 న ఎన్నికల సంఘం రిలీజ్ చేసే ముసాయిదా ఓటర్ల లిస్టులో మీ పేరు ఉండాలంటే ఈ గడువును పాటించడం తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే ఆ తర్వాత మళ్లీ ఓటు హక్కు పొందడం చాలా కష్టంతో కూడుకున్న ప్రాసెస్ అవుతుంది.

గతంలో పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాలలో లక్షలాది మంది ఇలాగే నిర్లక్ష్యం వల్ల తమ తమ ఓటు హక్కు కోల్పోయారని, కాబట్టి ఏపీ ఓటర్లు ఆలస్యం చేయకుండా ఎన్యూమరేషన్(Enumeration) పేపర్స్‌ను ఫిల్ చేసి ఇవ్వాలని సూచిస్తున్నారు.

ఇప్పటివరకు మీకు ఈ పేపర్లు అందకపోతే ఓటర్ల అధికారిక వెబ్‌సైట్ కానీ ఈసీఐ.నెట్ యాప్‌లోకి కానీ వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారానే వీటిని సబ్మిట్ చేసే అవకాశం కూడా ఉంది. లేదా మీ ప్రాంత బీఎల్ఓను కలిసి డైరెక్టుగా ఫామ్ తీసుకోవచ్చు. మీ బీఎల్ఓ ఫోన్ నెంబర్ లోకల్ పోలింగ్ కేంద్రంలో లేదా సీఈఓ ఆంధ్ర వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

ఈ ప్రాసెస్‌లో రసీదును భద్రపరుచుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం 2002 నాటి ఓటర్ల లిస్ట్ ఆధారంగా ప్రస్తుత వివరాలను పరిశీలిస్తూ లింక్ చేస్తున్నారు. 2002 నాటి లిస్టులో మీ నేమ్ ఉంటే ఆ డీటెయిల్స్‌ను ఎన్యూమరేషన్ ఫామ్‌లో రాయాలి. అప్పటి జాబితాలో మీ పేరు లేకపోతే మీ పేరెంట్స్, భర్త , భార్య వంటి కుటుంబ సభ్యుల పేర్లు ఎవరివి ఉంటే వారి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

వీటితో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, కుటుంబ సభ్యుల పేర్లు, వారి ఎపిక్ కార్డ్ నంబర్ల వంటి సమాచారాన్ని నింపి, కొత్త కలర్ ఫోటోను జత చేసి బీఎల్ఓకు ఇవ్వాలి. రెండు ఫాములలో ఒకదానిపై బీఎల్ఓ సైన్ చేసి రసీదుగా మీకు ఇస్తారు. దీన్ని జాగ్రత్తగా దాచుకోవాలి. ఈ రెండు జాబితాలు కూడా అధికారిక వెబ్‌సైట్లతో పాటు బీఎల్ఓల వద్ద అందుబాటులో ఉంచారు.

Enumeration

ఇక గణాంకాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 4కోట్ల16లక్షల27వేల694 మంది ఓటర్లు ఉండగా, వారిలో సుమారు 99.67 శాతం మందికి ఎన్యూమరేషన్ పత్రాల డిస్ట్రిబ్యూషన్ పూర్తయింది. అయితే పంపిణీ చేసిన వాటిలో ఇప్పటివరకు కేవలం 2కోట్ల 88 లక్షల28వేల 419 మంది పత్రాల డిజిటలైజేషన్ మాత్రమే పూర్తయింది. అంటే ఇంకా 1కోటి26లక్షల63వేల972 మంది ఓటర్ల పత్రాలను డిజిటలైజ్ చేయాల్సి ఉంది.

అలాగే మరో 1లక్ష35వేల303 మందికి ఇంకా పత్రాలు అందాల్సి ఉంది. ఈ పనులన్నీ పూర్తి కావడానికి ఇంకా ఆరు రోజులు మాత్రమే టైమ్ మిగిలి ఉంది. ఏపీవ్యాప్తంగా ఉన్న 46,397 మంది బీఎల్ఓలతో పాటు ఇతర ఉద్యోగులను కూడా ఉపయోగించుకుంటేనే.. రోజుకు సగటున 21 లక్షలకు పైగా ఎన్యూమరేషన్(Enumeration) ఫామ్‌లను పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తేనే గడువులోగా ఈ డిజిటలైజేషన్ ప్రాసెస్ కంప్లీట్‌గా ముగుస్తుంది.

Snakes : ఆ పాములు గుడ్లు పెట్టవు..పిల్లల్ని కనే ఆ పాముల ప్రత్యేకతలేంటో తెలుసా?

Exit mobile version