Healthy Drink : ఉదయాన్నే టీ, కాఫీలు తాగుతున్నారా? ఈసారి రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంచే ఈ హెల్దీ డ్రింక్‌ ట్రై చేయండి..

Healthy Drink : ఈ హెల్దీ డ్రింక్‌ శరీరానికి రోజంతటికీ కావలసిన ఎనర్జీని అందించడంలోనూ అలాగే రోజూ ఫేస్ చేసే బాడీ వీక్నెస్‌ను తగ్గించడంలోనూ ఎంతగానో ఉపయోగపడుతుంది.

Healthy Drink

చాలా మందికి మార్నింగ్ లేవగానే వేడివేడిగా టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే వీటికి బదులుగా సగ్గుబియ్యం, ఫూల్ మఖానా, పాలు , బెల్లంతో తయారు చేసే ఒక అద్భుతమైన ఎనర్జీ పాయసం తాగితే రోజంతా ఎంతో ఉత్సాహంగా, యాక్టివ్‌గా ఉండొచ్చని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఈ హెల్దీ(Healthy Drink) పాయసం వల్ల శరీరానికి ఇనిస్టెంట్ ఎనర్జీతో పాటు ఎంతో ఉత్సాహంగా ఉంచుతుందట.

ఈ టేస్టీ అండ్ హెల్దీ పాయసం తయారీకి రెండు గంటల పాటు బాగా నానబెట్టుకున్న అర కప్పు పెద్ద సగ్గుబియ్యం, ఒక కప్పు ఫూల్ మఖానా, 750 మిల్లీలీటర్ల పాలు, అర కప్పు తురిమిన బెల్లం, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, పది బాదంపప్పులు, కొద్దిగా పిస్తా పప్పులు , నాలుగు యాలకులు సిద్ధం చేసుకోవాలి.

ఈ పాయసం తయారీ విధానం విషయానికి వస్తే.. ముందుగా సగ్గుబియ్యాన్ని నీళ్లలో నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత బెల్లాన్ని కొద్దిగా నీటిలో వేసి కరిగించి, కాస్త మరిగించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా నెయ్యి వేసి అందులో ఫూల్ మఖానాను దోరగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి.

వేరొక గిన్నెలో పాలను బాగా మరిగించి, దానిలో సగ్గుబియ్యాన్ని వేసి అవి కాస్త ఉడికే వరకు అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత బాదం, పిస్తా, యాలకులను మెత్తగా పొడి చేసి ఆ మరుగుతున్న పాలలో కలపాలి. తర్వాత ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న ఫూల్ మఖానాను కూడా అందులో వేయాలి.

Healthy Drink

పాయసం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, అది కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రమే ముందుగా సిద్ధం చేసుకున్న బెల్లం సిరప్‌ను వడగట్టి అందులో బాగా కలుపుకుని సర్వ్ చేయాలి.ఎందుకంటే వేడి పాలలో బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి కాబట్టి పాయసం చల్లారిన తర్వాతే బెల్లం కలపాలి.

ఈ పాయసం ద్వారా బాడీకి కావలసిన ఐరన్ , క్యాల్షియం వంటి ఎన్నో అద్భుతమైన పోషకాలు లభిస్తాయి. ఇది శరీరానికి రోజంతటికీ కావలసిన ఎనర్జీని అందించడంలోనూ అలాగే రోజూ ఫేస్ చేసే బాడీ వీక్నెస్‌ను తగ్గించడంలోనూ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే దీనినే ప్రామాణికమైన డాక్టర్ల సలహాగా మాత్రం ఎవరూ అనుకోవద్దని గమనించాలి.

Yamaha Aerox : సింగిల్ ఛార్జ్‌పై 117 కిలోమీటర్ల మైలేజ్..రిమూవబుల్ బ్యాటరీతో యమహా స్కూటీ ఫీచర్ అదుర్స్..

Exit mobile version