DWACRA
ఏపీలోని డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం శుభవార్తను అందించింది. మహిళలు ఆర్థికంగా మరింత ఎదగడానికి , సొంతంగా వ్యాపారాలు ప్రారంభించడానికి వీలుగా ఎలాంటి గ్యారెంటీ లేకుండా రూ. 10 లక్షల వరకు పర్సన లోన్లు అందించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు.
అర్హులైన డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలంతా ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకుని లోన్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కొండపల్లి శ్రీనివాస్ కోరారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన దీన్ దయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకంలో భాగంగా.. కొత్త ఐఈఎల్‌ఏ (IELA) విధానం ద్వారా ఈ రుణాలు మంజూరు చేయనున్నారు.
అయితే ఈ రూ. 10 లక్షల పర్సనల్ లోన్‌ను మహిళలకు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSME) , వ్యవసాయ అనుబంధ వ్యాపార యూనిట్లు పెట్టుకోవడానికి మాత్రమే ఇస్తారు.
ముఖ్యంగా పుట్టగొడుగుల పెంపకం, తేనెటీగల పెంపకం, ఫుడ్ ప్రాసెసింగ్, మునగ సాగు, నర్సరీల నిర్వహణ, సోలార్ డ్రయ్యర్ల ఏర్పాటు, చేపల పెంపకంతో పాటు రక్షిత సాగు వంటి లాభదాయకమైన వ్యాపారాలు ప్రారంభించాలని అనుకునే మహిళలకు ఈ రుణాలు ఎంతో అండగా నిలుస్తాయి.
ఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకునే విధానంలో గానీ, ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) తయారు చేయడంలో గానీ సెర్ప్ శాఖలోని వెలుగు డిపార్ట్‌మెంట్ విభాగం అధికారులు మహిళలకు పూర్తి సహాయసహకారాలు అందిస్తారు.
మరోవైపు ఏపీలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలను (MSMEs) పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి కూటమి ప్రభుత్వం ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. చిన్న కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో ఐపీవోల (IPO) ద్వారా ఫండ్స్ సేకరించడాన్ని ప్రోత్సహించడంతో పాటు ఈక్విటీ రూపంలో పెట్టుబడులు సమకూర్చే మార్గాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది.
కేంద్ర ప్రభుత్వ పథకాలతో సంబంధం లేకుండానే, డ్వాక్రా మహిళల కుటుంబాలలోని పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ల అవసరాల కోసం కూడా ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా రుణాలు రిలీజ్ చేస్తూ మహిళా సాధికారతకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడంపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Chia Seeds : చియా గింజల ఆరోగ్య రహస్యాలు..తెలిస్తే అస్సలు వదలరు..
