Jagapathi Babu Sister : జగపతి బాబు చెల్లి లక్ష్మీ అపర్ణ ఘన విజయం.. ఒకే ఏడాదిలో భార్యాభర్తలిద్దరూ మేయర్లుగా రికార్డ్‌

Jagapathi Babu Sister : టీడీపీ మేయర్ అభ్యర్థి, సినీ నటుడు జగపతి బాబు సోదరి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ..గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 96వేల294 ఓట్ల భారీ మెజార్టీతో విజయాన్ని సాధించారు..

Jagapathi Babu Sister

ఏపీ రాజధాని ప్రాంగణమైన గుంటూరు మున్సిపల్ పోరులో త్రిముఖ కూటమి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వైసీపీ అంచనాలకు కూడా ఏమాత్రం అందకుండా.. కూటమి అభ్యర్థులు ప్రభంజనాన్ని సృష్టించారు. ముఖ్యంగా గుంటూరు మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి జరిగిన పోరులో ప్రముఖ సినీ నటుడు జగపతి బాబు సోదరి(Jagapathi Babu Sister), టీడీపీ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ఊహించని స్థాయిలో రికార్డు విజయం నమోదు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే స్పష్టమైన ఆధిక్యంతో దూకుడు ప్రదర్శించిన ఆమె, ఏకంగా 96,294 ఓట్ల భారీ మెజార్టీతో ప్రత్యర్థులపై విజయకేతనాన్ని ఎగురవేశారు.

ఓట్ల లెక్కలను ఓసారి పరిశీలిస్తే కూటమి విజయం ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతుంది. విజేత లక్ష్మీ అపర్ణకు ఏకంగా 2,08,925 ఓట్లు పోల్ అవవ్వగా, ఆమెపై పోటీ పడిన వైసీపీ అభ్యర్థి తాడికొండ శ్రీదేవి కేవలం 1,12,631 ఓట్ల వద్దే ఆగిపోయారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతికి కేవలం 4,805 ఓట్లు వచ్చాయి. అయితే నోటాకు 2,783 ఓట్లు పడగా.. మరో 8,555 ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి.

లక్ష్మీ అపర్ణ విజయంలో ఆమె సోదరుడు(Jagapathi Babu Sister), టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు రిలీజ్ చేసిన సెంటిమెంట్ అప్పీల్ వీడియో కూడా బాగానే వర్కవుట్ అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో తన చెల్లి కోవెలమూడి లక్ష్మీ అపర్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ జగపతి ఒక వీడియోను రిలీజ్ చేశారు.

ఇక డివిజన్ల వారీగా చూస్తే.. మొత్తం 76 డివిజన్లు ఉన్న గుంటూరు కార్పొరేషన్‌లో కూటమి క్లీన్ స్వీప్ చేసేసింది. ఏకంగా 64 స్థానాల్లో కూటమి అభ్యర్థులు జయభేరిని మోగించారు. దీనిలో ఎక్కువ భాగం టీడీపీ 48 స్థానాలను కైవసం చేసుకోగా, జనసేన 13, బీజేపీ 3 డివిజన్లలో గెలిచి తమ బలాన్ని చాటుకున్నాయి. మరోవైపు వైసీపీ కేవలం 11 డివిజన్లకే పరిమితమై పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఈ చారిత్రాత్మక విజయంలో మరొక అరుదైన ఆసక్తికర కోణం కూడా దాగి ఉంది. లక్ష్మీ అపర్ణ భర్త కోవెలమూడి రవీంద్ర గతంలో ఇదే గుంటూరుకి పది నెలల పాటు మేయర్‌గా బాధ్యతలను నిర్వహించారు. ఇప్పుడు అదే మేయర్ కుర్చీని లక్ష్మీ అపర్ణ అధిరోహించబోతున్నారు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో ఒకే ఇంటి నుంచి భార్యాభర్తలిద్దరూ వరుసగా సిటీ ప్రథమ పౌరులుగా సేమ్ పదవిలో కూర్చోవడం గుంటూరు కార్పొరేషన్ హిస్టరీలోనే ఒక ప్రత్యేకమైన రికార్డుగా నిలిచిపోనుంది.

Dragon : తారక్ డ్రాగన్ కోసం ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్‌.. రవి బస్రూర్ మ్యాజిక్‌తో మ్యూజికల్ హిట్ గ్యారంటీనా?

↑
Exit mobile version