Jana Sena Party Symbol
పాలిటిక్స్‌లో చిన్న పొరపాటు కూడా భారీ నష్టానికి దారి తీస్తుంది. ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో పార్టీ గుర్తులను పోలిన ఇతర గుర్తులు ఇండిపెండెంట్ అభ్యర్థులకు దక్కితే ఆ ప్రభావం క్లియర్‌గా ఫలితాలపై పడుతుంది. ఈ ముప్పును ముందుగానే ఊహించిన పవన్ కళ్యాణ్ లీడర్ షిప్‌లోని జనసేన పార్టీ, రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద సాధించిన విజయం ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జనసేన పార్టీకి ఊరట లభించింది. తమ పార్టీ అఫీషియల్ గుర్తు గాజు గ్లాసును(Jana Sena Party Symbol) పోలి ఉన్నాయంటూ బకెట్, పెన్ స్టాండ్ గుర్తులపై జనసేన లేవనెత్తిన అభ్యంతరాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సానుకూలంగా స్పందించింది. స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే గుర్తుల లిస్ట్ నుంచి ఆ రెండింటిని టెంపరరీగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గాజు గ్లాసు పోలికలతో(Jana Sena Party Symbol) ఉన్న ఇతర రెండు గుర్తులను.. ఎస్ఈసీ టెంపరరీగా నిలిపివేయడంతో జనసేన శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతుంది. చాలామంది ఓటర్లు ఓటు వేసేటప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా గాజు గ్లాస్ గుర్తును ఈజీగా గుర్తుపట్టడానికి ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు.
ఎస్ఈసీ ..రిటర్నింగ్ ఆఫీసర్లకు జారీ చేసిన ఈ మార్గదర్శకాలు ఎన్నికల నిష్పాక్షికతను మరింత పెంచాయని విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా రాబోయే స్థానిక పోరులో తమ అధికారిక గ్లాస్ గుర్తుపై ఎలాంటి గందరగోళం లేకుండా ఓటర్లు హాయిగా ఓటు వేసే అవకాశం వచ్చిందని జనసేన వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
Ravana Tandavam : రామాయణ నుంచి రావణ తాండవం గ్లింప్స్.. ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్స్ క్రేజీ కాంబో..
