Janasena
పాలిటిక్స్‌లో వారసత్వాలు, పైస్థాయి సిఫార్సుల కాలానికి ఇకపై చెక్ పెట్టాలనే ఆలోచనతో జనసేన(Janasena) అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సెన్సేషన్ డెసిషన్ తీసుకున్నారు. సాధారణంగా ఏ పార్టీలో చూసినా సరే, గ్రౌండ్ లెవెల్‌లో ఉండే కార్యకర్తలు కేవలం జెండాలు మోయడానికి, స్లోగన్లు ఇవ్వడానికే సరిపోతుంటారు. అధికారం, సీట్లు మాత్రం పైస్థాయి రికమండేషన్లతోనో , బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లకో దక్కుతుంటాయి.
కానీ, ఈ పాత పద్ధతికి బ్రేక్ వేస్తూ… జనసైనికులే రేపటి లీడర్లు అనే క్లియర్ స్లోగన్‌తో, కింది స్థాయి నుంచి లీడర్స్‌ను తయారుచేసే ఒక కొత్త చాప్టర్‌ను మంగళగిరి వేదికగా ప్రారంభించారు. పార్టీల కోసం జెండాలు మోసే చేతులే ..రేపు చట్టసభల్లో గళం విప్పాలన్నదే మెయిన్ టార్గెట్‌గా ఈ కార్యక్రమం సాగుతుంది.
దీనికోసం మంగళగిరిలోని జనసేన(Janasena) మెయిన్ ఆఫీస్‌లో 3 రకాల స్పెషల్ అప్లికేషన్లను అందుబాటులో ఉంచారు. విలేజ్, మండల స్థాయి నుంచి మొదలు అసెంబ్లీ, పార్లమెంట్ స్థాయిల వరకు ఎవరికి ఎక్కడ బాధ్యతలు తీసుకోవాలని ఉందో, వాళ్లు డైరెక్టుగానే అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి 5 రోజుల టైమ్ మాత్రమే ఇచ్చారు. అంతేకాదు వచ్చిన ప్రతీ అప్లికేషన్‌ను క్షుణ్ణంగా చెక్ చేయడానికి 32 మందితో కూడిన ఒక పటిష్టమైన స్పెషల్ కమిటీని కూడా ఫీల్డ్‌లోకి దించారు.
అలా అప్లై చేసిన కార్యకర్త జనసేన పార్టీ కోసం ఎంతకాలంగా గ్రౌండ్‌లో కష్టపడుతున్నారు, వారి నిబద్ధత ఎలాంటిది, పబ్లిక్ ఇష్యూస్‌పై వారికున్న గ్రిప్ ఏంటి, జనాల్లో వారికి కనెక్టివిటీ ఎలా ఉంది అనే విషయాలను ఈ కమిటీ నిశితంగా పరిశీలిస్తుంది.
కాగా ఈ అంశంపై మాట్లాడిన.. మినిస్టర్ కందుల దుర్గేష్ ఈ ఫిల్టరింగ్ అంతా అయ్యాక ఫైనల్ డెసిషన్ మాత్రం తమ అధినేత పవన్ కళ్యాణ్‌దే అని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఇది కేవలం జనసేన పార్టీ పోస్టుల భర్తీ మాత్రమే కాదు, పార్టీ ఫ్యూచర్‌ను డిసైడ్ చేసే ఒక స్ట్రాటజిక్ స్టెప్ అని వివరించారు.
ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల జనసేనకు క్షేత్రస్థాయిలో మైలేజ్ మామూలుగా ఉండదన్న టాక్ నడుస్తోంది. నిజాయితీగా వర్క్ చేస్తే చాలు, కచ్చితంగా గుర్తింపు వస్తుందనే బలమైన నమ్మకం వస్తే.. కేడర్‌లో జోష్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తుందనడంలో నో డౌట్.
అంతేకాదు, ప్రతి ఎలక్షన్ టైమ్‌లోనూ వేరే పార్టీల నుంచి వచ్చే పారాచూట్ లీడర్స్‌పై ఆధారపడే అవసరం పార్టీకి ఇకపై ఉండదు. ప్రాంతీయ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నవారే లీడర్స్‌గా తయారవుతారు కాబట్టి, వాళ్లు జనాలకి ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఈ స్ట్రాటజీ పార్టీకి ఒక స్ట్రాంగ్ పునాదిని ఇస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చాలా పార్టీల్లో కూడా యూత్, మహిళా వింగ్స్ లాంటి కమిటీలు వేస్తుంటారు. కానీ అవన్నీ చాలావరకు పైస్థాయి లీడర్ల కనుసన్నల్లో, రికమండేషన్లతోనే క్లోజ్ అయిపోతాయి. జనసేన(Janasena) మాత్రం అందుకు డిఫరెంట్‌గా ఓపెన్ అప్లికేషన్ సిస్టమ్ ద్వారా అందరికీ సమాన ఛాన్స్ ఇస్తోంది.
అయితే ఈ సెలెక్షన్ ప్రాసెస్‌లో రికమండేషన్లు, ఫేవరిటిజంకు చోటివ్వకుండా నూటికి నూరు శాతం జెన్యూన్‌గా జరగాలి. కార్యకర్తల నిజమైన కష్టాన్ని గుర్తించి సీటు ఇచ్చినప్పుడే వారికి పార్టీపై నమ్మకం పెరుగుతుంది. లీడర్లను సెలెక్ట్ చేయడం అనే విషయం కంటే, వారందరినీ పార్టీ ఐడియాలజీకి కట్టుబడి ఉండేలా చూసుకోవడమే ఇప్పుడు జనసేన ముందున్న అసలైన టాస్క్ అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Gold Rate : వరుసగా రెండోరోజు దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..రూ.1,800 తగ్గిన పసిడి ధర
