Pawan Kalyan Divorce
ఏపీ పాలిటిక్స్‌లో, ఇటు టాలీవుడ్లో కూడా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ఒక సంచలన వార్త నెట్టింట ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తోంది. తన భార్య అన్నా కొణిదెలతో వివాహ బంధానికి ఫుల్స్టాప్(Pawan Kalyan Divorce) పెడుతున్నట్లు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు.
ఇద్దరి పరస్పర అంగీకారంతోనే ఈ రిలేషన్ నుంచి విడిపోవాలని డిసైడ్ అయ్యామని వారు రిలీజ్ చేసిన నోట్లో వెల్లడించారు. కాలం ఎంత మారుతున్నా పర్సనల్ లైఫ్‌లో ఎదురయ్యే కొన్ని ఊహించని మలుపులు ఫ్యాన్స్‌ను కలవరపెడుతుంటాయి, ఇప్పుడు పవన్ విషయంలో కూడా మరోసారి అదే జరుగుతోంది. విడిపోయినా సరే తాము మంచి ఫ్రెండ్స్‌గానే ఉంటామని, పిల్లల బాధ్యతలను మాత్రం ఉమ్మడిగానే చూసుకుంటామని వారిద్దరూ చెప్పుకొచ్చారు. ఈ కష్ట సమయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దని, తమ జర్నీలో అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.
కొద్ది రోజుల క్రితం వరకు నెట్టింట అన్నా లెజినోవా సడన్‌గా తన అకౌంట్స్‌ని క్లోజ్ చేయడం వెనుకున్న అసలు రీజన్ ఇప్పుడు ఈ ప్రకటన(Pawan Kalyan Divorce) ద్వారా బయటపడింది. పవన్ లైఫ్‌లో ఇలాంటి సిచ్యుయేషన్ మూడోసారి రిపీట్ కావడం పట్ల ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నా , వారి వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవించాలని కోరుకుంటున్నారు.ఇలా జరిగి ఉండకూడదని..పవన్ అకౌంట్ హ్యాక్ అయి ఈ ఫేక్ న్యూస్ వైరల్ అయిందన్న వార్త వినిపిస్తే బాగుణ్ణు అని అభిమానులు ఆశపడుతున్నారు.
మొత్తంగా ప్రజా జీవితంలో డిప్యూటీ సీఎం స్థాయిలో ఉంటూనే ..పర్సనల్ లైఫ్‌లో ఈ రేంజ్లో ఇబ్బందులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న పవన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ డిబేట్‌కు దారి తీసింది. అసలే అవకాశం కోసం ఎదురుచూస్తున్న వైసీపీ నేతలకు ఈ వార్త కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయంగా, పర్సనల్‌గా టార్గెట్ చేయడానికి రెడీగా ఉన్నవారికి పవన్ ఎలా సమాధానం చెబుతారో చూడాలి.
Mogging : ఏంటీ మాగింగ్..సెలబ్రిటీల నుంచి యూత్ వరకూ ఎందుకింత ఫేమస్ అయింది?
