Monday Nominations : రచ్చ రచ్చ అయిన నామినేషన్ డే..చివర్లో బిగ్ బాస్ ఇచ్చిన ఊహించని ట్విస్ట్..

Monday Nominations : బిగ్ బాస్ హౌస్‌లో సోమవారం నామినేషన్స్ రచ్చ పీక్స్‌కు చేరింది. సభ్యుల మధ్య వాదనలు, గొడవలు, బిగ్ బాస్ ఇచ్చిన ఊహించని ట్విస్ట్ ఇక్కడ చూడండి.

Monday Nominations

బిగ్ బాస్ హౌస్‌లో మండే రోజు జరిగే నామినేషన్స్(Monday Nominations) అంటేనే నిప్పులు చెరిగే వాతావరణం ఉంటుంది. ఈసారి కూడా ఎప్పటిలాగే ఆ రేంజ్‌లోనే హౌస్‌మేట్స్ ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఈ వీక్ నామినేషన్స్ కోసం బిగ్ బాస్ ఒక డిఫరెంట్ టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్.. ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి పేరు చెప్పి.. ఆ రీజన్స్ వివరిస్తూ వారి ఫోటో ఉన్న బాల్‌ను డోర్ బయటకు వెళ్లేలా తన్నాలని రూల్ పెట్టారు. ఇక ఈ ప్రాసెస్ మొదలైనప్పటి నుంచే హౌస్‌లో మాటల యుద్ధం పీక్స్‌కి చేరింది.

మొదట అమన్, శివ్‌ను నామినేట్ చేస్తూ గోట్ టాపిక్ తీయగా.. వీరి మధ్య జరిగిన మాటల్లోకి త్రిగున్ ఎంట్రీ ఇవ్వడంతో రగడ మొదలైంది. ఇక ముకేష్ తన ఫ్రెండ్‌ సుధీర్‌ను టార్గెట్ చేస్తూ నమ్మకద్రోహి అంటూ ఫైర్ అయ్యాడు. తమను వదిలేసి వెళ్లిపోయాడని, నువ్వు కెప్టెన్ కాదని.. కంటెండర్ కూడా అయ్యేవాడివి కాదంటూ ఇద్దరి మధ్య ఫుల్ ఫైట్ జరిగింది.

మరోవైపు శ్వేతా, నీతూ మాస్టర్‌ను నామినేట్ చేస్తూ అసలు డ్రామా షురూ మొదలయింది. నీతూ త్రిగుణ్‌కు భజన చేస్తుందని, గేమ్ ఆడకుండా సేఫ్ గేమ్ ఆడుతుందని శ్వేతా విమర్శించగా, మధ్యలో త్రిగుణ్ ఇంటర్‌ఫియర్‌ చేసుకోవడంతో పెద్ద గొడవ అయింది. నీతూ ప్రతి చిన్న విషయానికి ట్రిగ్గర్ అయిపోతూ అరుస్తుండటంతో అక్కడ వాతావరణం వేడెక్కింది.

ఇక శివ్, ముకేష్‌ను నామినేట్ చేస్తూ ప్రాంక్ ఇష్యూను, క్యారెక్టర్ గురించి మాట్లాడగా, సుధీర్ కూడా ముకేష్‌పై ఫైర్ అయ్యాడు. రామకృష్ణ ఆటలో గివ్ అప్ ఇచ్చావంటూ సుధీర్‌ను నామినేట్ చేయగా, అక్కడ కూడా సుధీర్, ముకేష్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. నరేష్, దేబ్జానీ కూడా నీతూ మాస్టర్‌ను టార్గెట్ చేస్తూ సేఫ్ ప్లేయర్ అని, తన గేమ్ వల్ల అందరి ఆట డిస్టర్బ్ అవుతుందని నామినేట్ చేశారు. సుధీర్ మరోసారి ముకేష్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించగా, నీతూ మాస్టర్ త్రిగుణ్‌ను నామినేట్ చేయడం మరింత రచ్చకు దారితీసింది.

Monday Nominations

త్రిగుణ్ తనను జోకర్ అన్నాడని, ప్రతి దానికి ఎమోషనల్ అవుతూ నీతూ సింపతీ గేమ్ ఆడుతోందని మిగిలిన వారు మండిపడ్డారు. వంశీ, రామ్ ప్రసాద్, వర్షిణి ఇలా ప్రతీ ఒక్కరూ ఎవరికి నచ్చిన పాయింట్లు చెబుతూ హౌస్‌ను హోరెత్తించారు. టోటల్‌గా ఎవరి నామినేషన్లు ఎలా ఉన్నా, వీటి మొత్తానికి ఫుల్‌స్టాప్ పెడుతూ బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చి అందరికీ షాకిచ్చారు. సభ్యుల నామినేషన్లన్నీ పక్కన పెట్టిన బిగ్ బాస్.. ఈ వీక్ కెప్టెన్ వంశీ తప్ప హౌస్‌లో ఉన్న అందరినీ నామినేట్(Monday Nominations) చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో ఈ వీక్ ఎలిమినేషన్ రేసులో ఎవరెవరు నిలుస్తారనే టెన్షన్ ఆడియన్స్‌లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Naphthalene Balls : వార్డ్‌రోబ్‌లో నాఫ్తలీన్ బాల్స్‌ వేస్తున్నారా?..వాటితో ఆరోగ్యమా? అనారోగ్యమా?

↑
Exit mobile version