Postal Ballot Voting
ఆంధ్రప్రదేశ్‌లో లోకల్ బాడీ ఎలక్షన్స్ సమరం తుది ఘట్టానికి చేరుకుంటున్న సమయంలో.. ప్రక్రియలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్(Postal Ballot Voting) హంగామా అధికారికంగా కొనసాగుతోంది. ప్రజాస్వామ్య బదిలీలో భాగస్వాములయ్యే అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కీలకమైన ప్రాసెస్ వరుసగా రెండు రోజుల పాటు జరుగుతుంది.
నవంబర్ 1 వతేదీ ఆదివారం ఎన్నికల రోజున ఓటింగ్ కేంద్రాల్లో డైరెక్టుగా లైన్లలో నిలబడలేని అత్యవసర సేవల సిబ్బంది, పోలింగ్ విధుల్లో పాల్గొనే వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న అర్హులైన ఓటర్లంతా తమ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ వెసులుబాటును కల్పించారు.
అక్టోబర్ 29 వ తేదీ అలాగే అక్టోబర్ 30 వ తేదీన ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎలాంటి అక్రమాలకు, బూత్ క్యాప్చరింగ్‌కు చోటు లేకుండా ప్రశాంతంగా, నిష్పాక్షికంగా ఎన్నికలను నిర్వహించడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ప్రతీ వార్డు పరిధిలో ఓటింగ్ సమర్థవంతంగా సాగించానికి ఒక రిటర్నింగ్ అధికారితో పాటు ఆయనకు సహాయంగా ఇద్దరు సహాయక అధికారులు ఈ కార్యక్రమంలో ఉంటారు.
పోటీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు అలాగే వారి ఏజెంట్ల సమక్షంలోనే బ్యాలెట్ బాక్సులను క్షుణ్ణంగా తనిఖీ చేసి సీల్ చేయడమే కాకుండా.. ఏజెంట్ల సమక్షంలోనే ఓటింగ్ ప్రాసెస్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఈ రెండు రోజుల పాటు జరిగే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్(Postal Ballot Voting) ముగిసిన వెంటనే, ఓట్లు నమోదైన ఆ బాక్సులను పటిష్ఠమైన పోలీసు భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించి సీల్ చేస్తారు. ఓట్ల లెక్కింపు రోజున ఎప్పటిలాగే సాధారణ ఓట్ల లెక్కింపు కంటే ముందుగా.. ఈ పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు.
IT Corridor Traffic : బయోడైవర్సిటీ టు నాలెడ్జ్ సిటీ..ఐటీ కారిడార్‌లో త్వరలోనే వన్-వే లూప్ రౌండ్..
