Super ElNino : సూపర్‌ ఎల్‌నినో కలకలం.. ఈ 6 నెలలలో 55వేల మరణాల ప్రమాదం..

Super ElNino : రాబోయే 6 నెలల్లో భారతదేశంలో ఎల్‌నినో వేడి తీవ్రత వల్ల ఊహించని మరణాలు సంభవించే ముప్పుందని షికాగో యూనివర్సిటీ క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ రిపోర్ట్ వెల్లడించింది.

Super ElNino

భారతదేశంలో రాబోయే రోజుల్లో వాతావరణ మార్పులు తీవ్ర ముప్పుగా పరిణమించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. షికాగో యూనివర్శిటికీ చెందిన క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ తాజాగా రిలీజ్ చేసిన ఎల్‌నినో హీట్ మోర్టాలిటీ ట్రాకర్ నివేదిక దేశ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది.

వచ్చే 6 నెలల కాలంలో అంటే 2026 అక్టోబర్ నుంచి 2027 మార్చి మధ్యలో సూపర్ ఎల్‌నినో(Super ElNino) ప్రభావం వల్ల నమోదయ్యే విపరీతమైన టెంపరేచర్‌ల కారణంగా భారత్‌లో సాధారణ స్థాయికి మించి సుమారు 55వేల అదనపు మరణాలు సంభవించే డేంజర్ ఉందని ఈ అధ్యయనం అంచనా వేసింది. మరీ మెయిన్‌గా మార్చి నెలలోనే ఈ వేడి తీవ్రత అత్యంత ఘోరంగా ఉంటుందని హెచ్చరించింది.

ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఈ ఎల్‌నినో(Super ElNino) తీవ్రమైన వేడి వల్ల రాబోయే అర్ధ సంవత్సరంలో సుమారు 8.57 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ముప్పు ఉందని ట్రాకర్ పేర్కొంది. అత్యధిక అదనపు మరణాలు సంభవించే అవకాశం ఉన్న దేశాల జాబితాలో నైజీరియాలో56,000 తో మొదటి స్థానంలో నిలవగా, భారతదేశం 55,000 అంచనాతో రెండో స్థానంలో ఉంది.

ఆ తర్వాతి స్థానాల్లో ఇండోనేషియా, బ్రెజిల్ దేశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎల్‌ నినో ప్రభావంతో.. రోజూ ఎండలో కష్టపడే శ్రామికులు, వృద్ధులు, పసిపిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ ఉష్ణోగ్రతల వల్ల ఎక్కువ ప్రభావానికి గురయ్యే అవకాశముంది.

అయితే ఇవి కేవలం గతంలో నమోదైన గణాంకాలతో పాటు ప్రస్తుత వాతావరణ నమూనాలను ఆధారంగా వేసిన ముందస్తు అంచనాలు మాత్రమే అని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. స్థానికంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే ముందస్తు రక్షణ చర్యలతో పాటు మంచి తాగునీటి వసతులు, చల్లదనాన్నిచ్చే కేంద్రాల ఏర్పాటు , తక్షణ వైద్య సదుపాయాల ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాణనష్ట తీవ్రతను తగ్గించొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Postal Ballot Voting : ఏపీ స్థానిక పోరులో కీలక అంకం..కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్..

↑
Exit mobile version