Prakash Raj : నీ పని నువ్వు చూసుకో..జనసేన వర్సెస్ ప్రకాష్ రాజ్

Prakash Raj : ప్రకాష్ రాజ్ ట్వీట్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు

Prakash Raj

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయనను విమర్శలతో వెంటాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నటుడు ప్రకాష్ రాజ్ మాత్రమే. గతంలో చాలా సార్లు పవన్ ను సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్ పేరుతో పవన్ తో పాటు జనసేన నేత నాగబాబును కూడా ప్రకాష్ రాజ్(Prakash Raj) టార్గెట్ చేస్తుంటారు.

ఇప్పుడు మరోసారి నాగబాబును, పవన్ ను తగులుకున్నారు ప్రకాష్ రాజ్. ఇటీవల నాగబాబు చేసిన ఓ ట్వీట్ దీనికి కారణమైంది. పార్టీ నిర్ణయాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ మాటే శాసనమని, ఏది మంచో, ఏది చెడో ఆయనకు తెలుసంటూ నాగబాబు ట్వీట్ చేశాడు.

నాయకుడు నడిచే దారిలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో మిగిలిన వారికి తెలీదనీ, అందుకే ఎవరూ నోరెత్తకుండా , ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా ఆయన వెనకాల నడవాలంటూ నాగబాబు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై జనసేన ప్రత్యర్థి పార్టీ నేతలు ఎవ్వరూ స్పందించలేదు కానీ ప్రకాష్ రాజ్ మాత్రం వేగంగా రియాక్టయ్యారు. అది కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. నాగబాబుకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

ప్రశ్నించకుండా వెనకాల వెళ్లడానికి మేమేమీ గొర్రెలం కాదు.. బానిస బ్రతుకులు బ్రతకడానికి సిద్ధంగా లేము అంటూ ట్వీట్ చేశారు. ఇలాంటి బెదిరింపులు మానుకోవాలని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం తమ హక్కంటూ స్పష్టం చేశారు. ఎంతటి పెద్ద లీడర్ అయినా సరే, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుందని గుర్తు చేస్తూ జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్ చేశారు.

Prakash Raj

అయితే ప్రకాష్ రాజ్ ట్వీట్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. నీకేం సంబంధం అంటూ ఫైర్ అవుతున్నారు. ఇటీవల జనసేన తెలంగాణలో పోటీ చేస్తుందంటూ పవన్ ప్రకటించగా.. దానికి ప్రకాష్ రాజ్ సెటైరికల్ గా ట్వీట్ చేశారు. దొరా అంటూ సంబోధిస్తూ సింగిల్ గా వస్తారా.. పొత్తుతో వస్తారా అంటూ వ్యాఖ్యానించారు.

అయితే ప్రకాష్ రాజ్(Prakash Raj) ట్వీట్ కు బండ్ల గణేశ్ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. అసలు నీకెందుకురా… నీ పని నువ్వు చూసుకో అంటూ ఓ రేంజ్ లో ప్రకాష్ రాజ్ ను ఏకిపారేశాడు. ప్రతీ దానిలో వేలు పెడుతావ్.. అసలు నువ్వు ఏమైనా ప్రధానివా.. కలెక్టర్ వా అంటూ కౌంటర్ ఇచ్చాడు. అయితే పవన్ ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నా ప్రకాష్ రాజ్ మాత్రం జస్ట్ ఆస్కింగ్ అంటూ వెనక్కి తగ్గడం లేదు.

Putin : భారత్ ఐటీ ప్రతిభకు రష్యా జోహార్లు..భారతీయుల కోడింగ్ నైపుణ్యాలను కొనియాడిన పుతిన్

Exit mobile version